మైక్రోగ్రీన్స్(Microgreens)ను ఇంట్లోనే సులభంగా పెంచుకోవాలంటే(Gardening) కొన్ని ప్రాథమిక వస్తువులు అవసరం. ట్రే లేదా చిన్న కంటైనర్, కోకోపీట్, సేంద్రియ ఎరువు, మంచి నాణ్యత గల విత్తనాలు, నీరు సిద్ధం చేసుకోవాలి. ముందుగా ట్రేను నేరుగా ఎండ పడని, వెలుతురు ఉండే ప్రదేశంలో ఉంచాలి. కోకోపీట్‌లో కొద్దిగా సేంద్రియ ఎరువు కలిపి ట్రేలో పరచాలి.
Read Also : Anti Biotics : యాంటీ బయోటిక్స్ తో వాడుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి..

నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త
అనంతరం విత్తనాలను సమానంగా చల్లి, రోజుకు రెండు సార్లు నీటిని స్ప్రే రూపంలో పిచికారీ చేయాలి. విత్తే ముందు రాత్రి విత్తనాల(Microgreens)ను నీటిలో నానబెట్టితే మొలకెత్తే శాతం పెరుగుతుంది. కోకోపీట్ ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి కానీ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. అధిక ఎండ కాంతి పడకుండా ఉంచితే మంచి ఫలితం వస్తుంది. సాధారణంగా 5 నుంచి 6 రోజుల్లో మొలకలు వస్తాయి. మొక్కలు సుమారు రెండు అంగుళాల ఎత్తు వచ్చిన తరువాత కత్తెరతో కోసి వినియోగించుకోవచ్చు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: