చుండ్రు అనేది చాలా సాధారణమైనది. కానీ ఇబ్బందికరమైన సమస్య. ఇది తల మీద చిన్న పసుపు, తెలుపు కణాలను లేదా చనిపోయిన కణాలను చూపిస్తుంది. ఈ సమస్య వలన తల మీద దురద, ఉబ్బరం మరియు ఇతర అసౌకర్యాలు కలుగుతాయి. చాలా మందికి ఇది నిత్య జీవితంలో ప్రతిదినం ఉండే సమస్యగా మారుతుంది. ఇప్పుడు, చుండ్రు ( Dandruff )వచ్చేందుకు కారణాలు మరింత వివరంగా తెలుసుకుందాం. ఫంగస్ లేదా ఈస్ట్ ఇన్‌ఫెక్షన్ కారణంగా, దీర్ఘకాలంగా మందులను వాడడం, థైరాయిడ్ వంటి వ్యాధులు ఉండడం, స్నానం చేసే నీరు, కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన వంటి అనేక కారణాల (For many reasons)వల్ల చాలా మందికి చుండ్రు వస్తోంది. అయితే చర్మ ఇన్‌ఫెక్షన్ కారణంగా వచ్చే చుండ్రుకు మాత్రం కచ్చితంగా డాక్టర్ సలహాను తీసుకోవాలి. కానీ సాధారణ చుండ్రును పోగొట్టుకునేందుకు ఖరీదైన షాంపూలు, చికిత్సలు వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే అత్యంత సహజసిద్ధంగా చుండ్రు ( Dandruff )ను తొలగించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చుండ్రును తగ్గించేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ ఎంతగానో పనిచేస్తుంది. ఈస్ట్ లేదా ఫంగస్ జుట్టులో పెరగడాన్ని ఇది నిరోధిస్తుంది.

కొబ్బరినూనె
యాపిల్ సైడర్ వెనిగర్‌ను కొద్దిగా తీసుకుని దానికి అంతే మొత్తంలో నీళ్లను కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుపై పోసి బాగా మర్దనా చేయాలి. 5 నుంచి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారంలో 2 సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది. చుండ్రు ( Dandruff )నుంచి బయట పడవచ్చు. కొబ్బరినూనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. జుట్టు కుదుళ్లు పొడిగా ఉండడాన్ని నివారిస్తుంది. దీంతో చుండ్రు నుంచి బయట పడవచ్చు. కొబ్బరినూనెలో సహజసిద్ధమైన యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. కనుక ఫంగస్ కారణంగా వచ్చే ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది. దీంతో చుండ్రు నుంచి బయట పడవచ్చు. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. దీన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా రాయాలి. బాగా మర్దనా చేసిన తరువాత 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తరువాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో 2 నుంచి 3 సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది. చుండ్రు పోవడమే కాకుండా శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి.
టీ ట్రీ ఆయిల్
చుండ్రును తగ్గించి శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడంలో టీ ట్రీ ఆయిల్ కూడా అద్భుతంగానే పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి ఫంగస్, ఈస్ట్ ఇన్‌ఫెక్షన్‌ను తగ్గిస్తాయి. చుండ్రు నుంచి ఉపశమనం లభించేలా చేస్తాయి. మీరు తరచూ ఉపయోగించే ఏదైనా షాంపూలో కొద్దిగా టీ ట్రీ ఆయిల్‌ను కలిపి దాంతో జుట్టుకు బాగా మర్దనా చేయాలి. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది. చుండ్రు పోతుంది.

బేకింగ్ సోడా
కలబంద గుజ్జులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. తలలో వచ్చే దురదను ఇది తగ్గిస్తుంది. చుండ్రు తగ్గేలా చేస్తుంది. కలబంద గుజ్జును నేరుగా జుట్టుకు రాయవచ్చు. 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో 2 సార్లు ఇలా చేస్తే చుండ్రును తగ్గించుకోవచ్చు. బేకింగ్ సోడా కూడా ఇందుకు బాగానే పనిచేస్తుంది. ఇందులో మైల్డ్ ఎక్స్‌ఫోలియెంట్ గుణాలు ఉంటాయి. ఇవి మృత చర్మ కణాలను తొలగిస్తాయి. అధికంగా ఉండే ఆయిల్‌ను తగ్గిస్తాయి. ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉంటాయి. జుట్టును ముందుగా తడి చేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను తీసుకుని దాన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా రాయాలి. బాగా మసాజ్ చేసిన తరువాత కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం నీళ్లతో కడిగేయాలి. కొద్ది రోజుల వరకు ఇలాగే చేయాలి. షాంపూ వాడకూడదు. దీంతో చుండ్రు పోతుంది. ఇలా పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు.
కొబ్బరినూనె తాగితే చుండ్రు తగ్గుతుందా?
2021 అధ్యయనం యొక్క ఫలితాలు కొబ్బరి నూనె తల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని మరియు చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయి. ప్రజలు కొబ్బరి నూనెను ముందు నేరుగా తలకు అప్లై చేయడానికి ప్రయత్నించవచ్చు లేదా కొబ్బరి నూనె ఉన్న షాంపూని వాడవచ్చు.
నూనె రాస్తే జుట్టు రాలడం తగ్గుతుందా?
జుట్టుకు నూనె రాయడం అనేది చాలా కాలంగా వస్తున్న ఒక అలవాటు, ఇది జుట్టు రాలడాన్ని గణనీయంగా తగ్గిస్తుంది మరియు మొత్తం జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. నూనె రాయడం యొక్క ఫ్రీక్వెన్సీ మీ జుట్టు రకం, నెత్తిమీద చర్మం పరిస్థితి, జీవనశైలి మరియు నిర్దిష్ట జుట్టు సమస్యలతో సహా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
వారానికి ఎన్ని సార్లు హెయిర్ వాష్ చేయాలి?
నిపుణులు వారానికి ఒకటి లేదా రెండుసార్లు మీ జుట్టును షాంపూతో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు; అయితే, మీరు గమనించినట్లయితే తరచుగా షాంపూ చేయండి: జుట్టు జిడ్డుగా ఉంటుంది. తల చర్మం జిడ్డుగా ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Fennel Seeds water : సోంపు గింజల నీళ్లను తాగడం వల్ల ఎన్నో