వంట చిట్కాలు వంటను సులభం, రుచికరంగా, వేగంగా(CookingTips) చేయడానికి సహాయపడతాయి. రుచి సరిచేయడం, పదార్థాలు అంటకుండా ఉడికించడం, వాసనలు తొలగించడం వంటి చిన్న చిట్కాలు వంటను మెరుగుపరుస్తాయి.
1. బెండకాయ కూర కోసం నిమ్మరసం ఉపయోగం
ముక్కల మీద కొద్దిగా నిమ్మరసం చల్లితే బెండకాయ కూరలో జిగురు తగ్గుతుంది.
2. సాంబార్ ఉప్పు ఎక్కువైతే చిక్కని పరిష్కారం
ఉప్పు ఎక్కువైతే బంగాళదుంప ముక్కలు లేదా శనగ పిండిలో కొద్దిగా నీరు కలిపి సాంబార్‌లో వేసితే రుచి సరిగా ఉంటుంది.
3. పాత్రల్లోని నోచు వాసన తొలగించే మార్గం
పాత్రలలోని నీచు వాసన పోవాలంటే వాటిలో కొద్దిగా ఉప్పు వేసి కొన్ని నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగితే సరిపోతుంది.
4. పాస్తా ముద్దగా కాకుండా ఉడికించే చిట్కా
పాస్తా ముద్దగా కాకుండా ఉండాలంటే ఉడికించే గిన్నెలో(CookingTips) ఒక చెక్క స్పూన్ లేదా ఫోర్క్ వేసి ఉడికించాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: