हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

TGSRTC: శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు!

Rajitha
TGSRTC: శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు!

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 43 ప్రముఖ శైవక్షేత్రాలకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా శ్రీశైలం, వేములవాడ, (vemulawada) ఏడుపాయల, కీసరగుట్ట వంటి క్షేత్రాలకు అధిక సంఖ్యలో బస్సులు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 208 అదనపు బస్సులు నడపడం విశేషం.

Read also: Hyderabad: విజయరెడ్డి డిప్రెషన్ తోనే చనిపోయిందనే వార్తలో నిజం లేదు

Special bus arrangements on the occasion of Shivaratri!

Special bus arrangements on the occasion of Shivaratri!

ప్రధాన క్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు

శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326 బస్సులు నడుస్తాయి. అలాగే వేలాల, కాళేశ్వరం, కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు కూడా ప్రత్యేక సర్వీసులు ఉంటాయి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల కోసం షామియానాలు, తాగునీరు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక సర్వీసులను గుర్తించేందుకు బస్సుల ముందు డిస్‌ప్లే బోర్డులు ఉంచుతున్నారు.

టికెట్ ధరలు, ఉచిత ప్రయాణం, బుకింగ్ వివరాలు

ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరలను గరిష్టంగా 1.5 రెట్లు సవరించారు. ఈ పెంపు కేవలం ప్రత్యేక సర్వీసులకు మాత్రమే వర్తిస్తుంది; రెగ్యులర్ బస్సుల ఛార్జీల్లో మార్పు లేదు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది. హైదరాబాద్–శ్రీశైలం మార్గానికి ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870