Ahmedabad Hotel Prices: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు (మార్చి 8) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. టైటిల్ పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు భారీగా అహ్మదాబాద్‌కు తరలివస్తున్నారు. దీంతో విమాన టిక్కెట్ ఛార్జీలు భారీగా పెరిగాయి. ఒక్కో నగరం నుంచి దాదాపు ఆరు రెట్ల వరకు ధరలు పెరిగాయి.
Read Also: Suryakumar Yadav statement : వరుణ్‌పై ఆందోళన వద్దు, అతడు వరల్డ్ నంబర్ 1: సూర్య

అహ్మదాబాద్ హోటళ్లలో కూడా ధరలు భారీగా పెరిగాయి
ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు సాధారణంగా రూ.3 వేలుగా ఉన్న విమాన టిక్కెట్ ధర ఇప్పుడు రూ.15 వేల నుంచి రూ.17 వేలు పలుకుతోంది. బెంగళూరు నుంచి అహ్మదాబాద్ టిక్కెట్ ధర రూ.13,000కు పెరిగింది.అభిమానులు తరలి వస్తుండటంతో అహ్మదాబాద్ హోటళ్లలో కూడా ధరలు భారీగా పెరిగాయి.
రూ.5 వేలు ఉన్న హోటల్ గది ధర ఇప్పుడు రూ.20 వేలుగా ఉంది. ఫైవ్ స్టార్ హోటళ్లలో డీలక్స్ రూమ్ ఖరీదు రూ.2 లక్షలకు పైగా ఉంది. అహ్మదాబాద్‌కు రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: