Social Media Ban Australia: గత ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఒక కీలక చట్టాన్ని అమలులోకి తెచ్చింది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ కఠినమైన నిబంధనలను రూపొందించింది. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా, వారిని వర్చువల్ ప్రపంచం నుంచి దూరంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా వెల్లడించింది.
Read Also: India: ఇరాన్ నౌకపై అమెరికా దాడి.. మోదీ మౌనంపై ప్రతిపక్ష నేతల విమర్శలు
అమెరికాలో ముందే మొదలైన నియంత్రణ
ఆస్ట్రేలియా జాతీయ స్థాయిలో చట్టం చేయగా, అమెరికాలోని పలు రాష్ట్రాలు అంతకంటే ముందే స్థానిక చట్టాల ద్వారా సోషల్ మీడియాపై నియంత్రణలు విధిస్తున్నాయి. పిల్లల డేటా ప్రైవసీ, ఆన్‌లైన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని, మైనర్లకు సోషల్ మీడియా యాక్సెస్ ఇచ్చేటప్పుడు తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేశాయి. ఈ తరహా నియంత్రణలు పిల్లల స్వేచ్ఛ కంటే వారి భద్రతకే ప్రాధాన్యతనిస్తున్నాయి.

యూరోపియన్ యూనియన్ అడుగులు.. ప్రపంచవ్యాప్త చర్చ!
ఆస్ట్రేలియా స్ఫూర్తితో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ (EU) కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. ఐరోపా దేశాల్లోని టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావంపై లోతైన అధ్యయనం జరుగుతోంది. మరికొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఇదే తరహా ఆంక్షలు విధించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: