Keyboard History: కీబోర్డ్ లోని అక్షరాల అమరిక గజిబిజిగా ఉండటానికి ఒక చారిత్రక కారణం ఉంది. 1870లో లాథమ్ షోల్స్ రూపొందించిన మొదటి టైప్‌రైటర్‌లో ప్రారంభంలో కీలు ABC క్రమంలో ఉండేవి. అయితే, టైప్ వేగంగా చేస్తే కీలు ఒకదానికొకటి చిక్కుకోవడం (key jamming) సమస్యగా మారింది.
Read Also:New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ

QWERTY ఫార్మాట్ ప్రకారం
ఈ సమస్యను పరిష్కరించడానికి 1873లో టైప్‌రైటర్ కీలు QWERTY ఫార్మాట్ ప్రకారం మళ్లీ అమర్చబడ్డాయి. ఈ కొత్త అమరిక టైపింగ్ వేగాన్ని కొంత తగ్గించినప్పటికీ, కీలు చిక్కకుండా సాఫీగా పనిచేయడం సాధ్యమయింది.
ఆ తర్వాత, కీబోర్డ్ డిజైన్ పరిశ్రమలో సాధారణంగా ఈ ఫార్మాట్ కొనసాగింది. ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్, ల్యాటిన్ అల్ఫాబెట్ ఆధారిత అన్ని కీబోర్డులు ఇప్పటికీ QWERTY ఫార్మాట్‌ను అనుసరిస్తున్నాయి. ఈ విధంగా, మనం రోజూ ఉపయోగించే కీబోర్డ్ అమరికలోని “అసమతుల క్రమం” వెనుకనికి శతాబ్దాల చరిత్ర ఉందని తెలుసుకోవడం ఆసక్తికరమే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: