అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్లోరిడాలోని మియామిలో ఆదివారం మియామీలో జరుగుతున్న అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రంప్ కు గతంలో వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ లో భాగస్వామ్యం ఉండేది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ కార్యక్రమాలకు తరచూ హాజరయ్యేవారు. ప్రముఖ రెజ్లర్లతో ఆయను స్నేహం కూడా ఉంది. అయితే, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక సమయం దొరకకపోవడంతో ఈ కార్యక్రమాలకు దూరమయ్యారు.అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలకడంతో ట్రంప్ తన స్టైల్లో అభిమానులతో కలిసి కాలు కదిపారు. ఆయనతో పాటు ఎలాన్ మస్క్, రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ, కాష్ పటేల్, మార్కో రూబియో, తులసీ గబ్బార్డ్, ట్రంప్ మనవరాలు కాయ్ ట్రంప్ తదితరులు సందడి చేశారు. ట్రంప్ అరీనాలోకి అడుగుపెట్టగానే జనం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆయనతో పాటు యూఎఫ్ సి, సిఈఓ డానా వైట్ కూడా ఉన్నారు. కాగా డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
హైలైట్
ట్రంప్ ప్రదర్శనకు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. యువ పురుష ఓటర్లలో ఆయనకున్న ప్రజాదరణను ఇది హైలైట్ చేసింది.ఆయన కుటుంబం, ముఖ్య సహాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన నిర్వహిస్తున్న బహిరంగ ప్రదర్శనలలో ఈ కార్యక్రమం ఒక భాగం
Read Also: Donald Trump: ఐఫోన్లపై ట్రంప్ కీలక నిర్ణయం !