IPL 2025: ఐపీఎల్ కామెంటేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన శార్దూల్ ఠాకూర్

IPL 2025: ఐపీఎల్ కామెంటేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన శార్దూల్ ఠాకూర్

ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఇటీవల తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. విమర్శలు చేసేవాళ్లు ముందుగా తమ గణాంకాలు ఒక్కసారి చూసుకొని మాట్లాడాలని అన్నాడు. ఈ మధ్య కామెంటేటర్లు బౌలర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని శార్దూల్ అభిప్రాయపడ్డాడు. శనివారం లఖ్​నవూ- గుజరాత్ మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్​లో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.ఈ సీజన్​లో మేం బౌలింగ్​లో బాగానే రాణిస్తున్నాం. కానీ, కామెంటరీ బాక్స్​లో కూర్చున్న వాళ్ల మాత్రం బౌలర్లను టార్గెట్ చేస్తున్నారు. మా పట్ల కఠినంగా ఉంటున్నారు. ఈ రోజుల్లో టీ20 క్రికెట్​లో 200 స్కోర్ సాధించడం సాధారణ విషయం అయ్యిందని గుర్తించాలి. స్టూడియోలో కూర్చొని ఇతరుల బౌలింగ్​ను విమర్శించడం చాలా ఈజీనే. కానీ, గ్రౌండ్​లో పరిస్థితుల గురించి వాళ్లకేం తెలీదు. ఎవరినైనా విమర్శించే ముందు ఓసారి తమ గణాంకాలు చూసుకొని మాట్లాడితే బెటర్’ అని శార్దూల్ పేర్కొన్నాడు.మెగా వేలంలో అన్​సోల్డ్​గా మిలిగిపోయిన శార్దూల్ ఈ సీజన్​లో శార్దూల్ అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందు మొహ్సిన్‌ స్థానంలో ఎంపికయ్యాడు. అలా వచ్చిన శార్దూల్ ప్రస్తుత సీజన్​లో తన బౌలింగ్​తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్​ల్లో 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన లిస్ట్​లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisements

అరుదైన ఘనత

ఈ మ్యాచ్​లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన శార్దూల్ 34 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే శార్దూల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ మైలురాయి అందుకున్న 18వ భారత బౌలర్‌గా, ఓవరాల్​గా 103వ ప్లేయర్​గా నిలిచాడు. కాగా ఈ లిస్ట్​లో స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ అగ్రస్థానం (315 వికెట్లు)లో ఉండగా, జస్ప్రీత్ బుమ్రా రెండో ప్లేస్​లో కొనసాగుతున్నాడు. స్పిన్నర్లలో యుజ్వేంద్ర చాహల్ 365 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు.

  IPL  2025: ఐపీఎల్ కామెంటేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన శార్దూల్ ఠాకూర్

లీగ్‌ మొదట్లో తడబడ్డ లక్నో తరువాత అద్భుతంగా పుంజుకుంది. శనివారం డబుల్‌ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో లక్నో 6 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై ఘన విజయం సాధించింది.తొలుత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌(38 బంతుల్లో 60, 6ఫోర్లు, సిక్స్‌), సాయి సుదర్శన్‌(37 బంతులోల 56, 7ఫోర్లు, సిక్స్‌) అర్ధసెంచరీలతో గుజరాత్‌ 20 ఓవర్లలో 180/6 స్కోరు చేసింది. బట్లర్‌(12), షారుఖ్‌ఖాన్‌(11) నిరాశపరిచారు. శార్దుల్‌ ఠాకూర్‌(2/34), రవి బిష్ణోయ్‌(2/36) రెండేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనకు దిగిన లక్నో 19.3 ఓవర్లలో 186/4 స్కోరు చేసింది. నికోలస్‌ పూరన్‌(34 బంతుల్లో 61, ఫోర్‌, 7సిక్స్‌లు), మార్క్మ్‌(్ర31 బంతుల్లో 58, 9ఫోర్లు, సిక్స్‌) అర్ధసెంచరీలతో లక్నో విజయంలో కీలకమయ్యారు. ప్రసిద్ధ్‌ కృష్ణ(2/26)కు రెండు వికెట్లు దక్కాయి.

Read Also: IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్

Related Posts
DavidWarner:ఎయిర్ఇండియా సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన డేవిడ్ వార్నర్
DavidWarner:ఎయిర్ఇండియా సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన డేవిడ్ వార్నర్

క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ ఇటీవల ఎయిర్ ఇండియా విమానయాన సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పైలట్లు లేని విమానంలో గంటల తరబడి నిరీక్షించాల్సి రావడం తనను Read more

Pakistan: ఇదీ… పాకిస్థాన్ క్రికెట్ అంటే…!: షాహిద్ అఫ్రిది
shahid afridi controversy 7 jpg

పాకిస్తాన్ క్రికెట్ జట్టు గురించి ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి: వారి ఆటతీరు ఎప్పుడూ ముందే అంచనా వేయలేం. అటువంటి అనిశ్చితి కలిగిన జట్టుగా పాకిస్తాన్ క్రికెట్ Read more

Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్.. 16మంది మావోలు హతం
Massive encounter in Chhattisgarh.. 16 Maoists killed

Chhattisgarh : ఈరోజు (శనివారం) ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 16 మంది మావోయిస్టులు Read more

Ind vs Aus: ప్చ్! బుమ్రా ఒక్కడినే నమ్మకుంటే కష్టమే..
ind vs aus

అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ షమీ జట్టులో చేరినట్లు విలేకరుల సమావేశంలో Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×