హెచ్1బీ వీసాలపై అమెరికా మరో షాక్

H-1B Visa: హెచ్1బీ వీసాలపై అమెరికా మరో షాక్

అమెరికా ప్రభుత్వం కీలక డేటాను డిలీట్ చేయనున్నట్టు ప్రకటించింది
హెచ్1బీ వీసా హోల్డర్లకు, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి అమెరికా ప్రభుత్వం మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గతంలో హెచ్1బీ వీసాల క్లియరెన్స్ కోసం సేకరించిన డేటాను పూర్తిగా తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisements
హెచ్1బీ వీసాలపై అమెరికా మరో షాక్

H-1B వీసాదారుల డేటా తొలగింపు – కొత్త నిర్ణయం
అమెరికాలో ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్ వే ద్వారా హెచ్1బీ వీసాదారుల డేటాను భద్రంగా ఉంచారు.
అయితే, ట్రంప్ ప్రభుత్వం ఈ డేటాను పూర్తిగా డిలీట్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.
ఇది ఈ రోజునుంచి అమలులోకి రాబోతోంది. హెచ్1బీ వీసా హోల్డర్ల వివరాలు భవిష్యత్తులో వీసా పొడిగింపు, తిరిగి మంజూరు, లేదా రద్దు ప్రక్రియలో ఉపయోగపడతాయి. అయితే, ఈ డేటా లేకపోతే మొత్తం ప్రక్రియ మళ్లీ ప్రారంభించాల్సి వస్తుంది.
ఐదేళ్ల డేటా మాత్రమే భద్రంగా ఉంచనున్న అమెరికా
ఐదేళ్ల లోపు ఉన్న డేటాను మాత్రమే భద్రంగా ఉంచి, అంతకంటే పాత డేటాను పూర్తిగా తొలగించాలని ట్రంప్ సర్కార్ ఆదేశించింది. అమెరికాలో కంపెనీలు అవసరమైన డేటాను తమ సర్వర్లలో నిల్వ చేసుకోవాలని సూచించింది. H-1B వీసాదారులకు పెరుగుతున్న ఇబ్బందులు. అమెరికాలో కొత్తగా హెచ్1బీ వీసా దరఖాస్తు చేసుకునేవారు, వీసా పొడిగించేవారు ఇకపై మరింత కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు
ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకసారి వీసా జారీ అయిన తర్వాత కూడా, అది ఇమ్మిగ్రేషన్ చట్టాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది ఎప్పుడైనా రివ్యూ చేయగలమని అమెరికా వెల్లడించింది. తద్వారా, అమెరికాలో వలసదారులకు ఉన్న నమ్మకాన్ని తొలగించేలా చర్యలు చేపట్టింది.

Related Posts
Nitish Kumar: నితీశ్ కుమార్‌ను రాజీనామా చేయాల‌ని తేజ‌స్వీ యాద‌వ్ డిమాండ్‌!
Nitish Kumar నితీశ్ కుమార్‌ను రాజీనామా చేయాల‌ని తేజ‌స్వీ యాద‌వ్ డిమాండ్‌

Nitish Kumar: నితీశ్ కుమార్‌ను రాజీనామా చేయాల‌ని తేజ‌స్వీ యాద‌వ్ డిమాండ్‌! బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదాస్పదంగా మారారు. ఆయన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో Read more

Revanth Reddy : నరేంద్ర మోదీ మంత్రులకు పెద్దన్న లాంటి వారు: రేవంత్ రెడ్డి
Revanth Reddy నరేంద్ర మోదీ మంత్రులకు పెద్దన్న లాంటి వారు రేవంత్ రెడ్డి

Revanth Reddy : నరేంద్ర మోదీ మంత్రులకు పెద్దన్న లాంటి వారు: రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్న లాంటి వారని, అలాంటి Read more

Donald Trump: మోడీ వస్తున్నారు వీధులను శుభ్రంగా వుంచండి: ట్రంప్‌ ఆదేశాలు
మోడీ వస్తున్నారు వీధులను శుభ్రంగా వుంచండి: ట్రంప్‌ ఆదేశాలు

మోడీ అమెరికా పర్యటనకు వస్తున్నారని, ఆయనతో పాటు మరికొంతమంది దేశాధ్యక్షులు కూడా వస్తారని, వాళ్లు వచ్చిన సమయంలో వాషింగ్టన్‌ డీసీ సుందరంగా మారిపోవాలని, నగరంలో టెంట్లు, గోడలపై Read more

బీజేపీకి తమిళ నటి రంజనా రాజీనామా
బీజేపీకి తమిళ నటి రంజనా రాజీనామా

జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 అమలుపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా, ఈ విధానంలో భాగంగా హిందీ, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×