గుజరాత్ (Gujarat) లోని ఆనంద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మహిసాగర్ నదిపై 40 ఏళ్ల క్రితం నిర్మించిన భారీ వంతెన (A huge bridge)ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించినగా మరికొందరు నది నీటిలో పడి గల్లంతయ్యారు. ఈ ప్రమాదం కారణంగా చాలా వాహనాలు నదిలో పడిపోయినట్టు తెలుస్తోంది. సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు నలుగురిని రక్షించారు. ఈ ప్రమాదం బుధవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో జరిగింది.

ఆత్మహత్యల నిలయం
గుజరాత్ (Gujarat) లోని ఆనంద్ జిల్లాలో ఉన్న మహిసాగర్ నదిపై 40 సంవత్సరాల క్రితం ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెనకు ఆత్మహత్యల నిలయం అనే మరో పేరు కూడా ఉంది. ఎందుకంటే ఈ వంతెనపై నుంచి దూకి ఇప్పటి వరకు చాలా మంది ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా ఉన్న వారు దీన్ని అలా పిలుస్తున్నారని కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ వంతెన నిర్మించి చాలా ఏళ్లు కావడంతో దీనికి మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఈ వంతెన పక్కనే కొత్త వంతెన నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించారు. కొత్త వంతెన నిర్మాణానికి ఆమోదం కూడా లభించింది. కానీ ఇంకా పనులు ప్రారంభం కాలేదు.
గుజరాత్ (Gujarat) లో కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదన ఉన్నా.. పాత వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపివేయలేదు. ఇప్పటికే మరమ్మత్తులు అవసరమైన వంతెన ఇటీవల కురిసిన వర్షాలకు మరింత శిథిలావస్థకు చేరుకుంది.ఈ క్రమంలోనే బుధవారం వాహనరాకపోకలు సాగిస్తున్న సమయంలో బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వంతెనపై ప్రయాణిస్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయినట్టు తెలుస్తోంది.ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా, మరికొందరు నది నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది ఇప్పటి వరకు నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. కాగా బ్రిడ్జ్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
గుజరాత్ లో పొడవైన వంతెన ఎక్కడ ఉంది?
భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్-స్టేడ్ వంతెన అయిన సుదర్శన్ సేతును ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ ఆకట్టుకునే వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని గుజరాత్‌లోని బెయ్ట్ ద్వారకా ద్వీపంతో కలుపుతుంది . ఈ అద్భుతమైన మౌలిక సదుపాయాల గురించి కొన్ని కీలక వివరాలు ఇక్కడ ఉన్నాయి.
గుజరాత్ లో పొడవైన నది ఏది?
నర్మద గుజరాత్‌లో అతి పొడవైన నది. ఇది మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలోని అమర్‌కాంతక్ పీఠభూమి నుండి పుడుతుంది. ఇది ఉత్తర మరియు దక్షిణ భారతదేశాల మధ్య దాదాపు 1312 కి.మీ పొడవునా పశ్చిమ దిశగా ప్రవహించడం ద్వారా చాలా సాంప్రదాయ సరిహద్దును ఏర్పరుస్తుంది.
ఏ నది పొడవు 720 కిలోమీటర్లు?
రావి నది ఉత్తర భారతదేశం మరియు పాకిస్తాన్లలో ఒక ముఖ్యమైన నది, దీని మొత్తం పొడవు దాదాపు 720 కి.మీ. ఇది సరిహద్దు దాటే నది, అంటే ఇది భారతదేశం మరియు పాకిస్తాన్ రెండింటి గుండా ప్రవహిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also:Nitin Gadkari: ఢిల్లీకి వచ్చాక వెంటనే వెళ్ళిపోవాలని అనిపిస్తుంది