ఎలోన్ మస్క్ పై పెరుగుతున్న వ్యతిరేకత..టెస్లా కార్లు పై ప్రభావం

Elon Musk : ఎలోన్ మస్క్ పై పెరుగుతున్న వ్యతిరేకత..టెస్లా కార్లు పై ప్రభావం

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, స్పెస్ ఎక్స్ అండ్ టెస్లా అధినేత ఎలోన్ మస్క్, డోనాల్డ్ ట్రంప్ టీంలో భాగమైనప్పటి నుండి అతని పై విద్వేషం పెరుగుతోంది. దీనికి కారణం ఆయన చేసే ప్రకటనలు. ఎందుకంటే ఇప్పుడు అతను రాజకీయ నాయకుడిల ప్రకటనలు చేస్తున్నారు, దింతో ప్రజలు అతనికి వ్యతిరేకంగా వ్యహరిస్తు టెస్లాపై కోపాన్ని వెళ్లగక్కుతున్నారు. టెస్లా అమ్మకాలు తగ్గడానికి కారణం ఎలోన్ మస్క్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న కోపం.

ఎలోన్ మస్క్ పై పెరుగుతున్న వ్యతిరేకత..టెస్లా కార్లు పై ప్రభావం

టెస్లాకు వ్యతిరేకంగా నిరసనలు
ఎలోన్ మస్క్ స్వదేశమైన అమెరికా, యూరప్‌లో కూడా టెస్లాకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. టెస్లా గురించి ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేసేందుకు జర్మన్ పబ్లికేషన్ T-ఆన్‌లైన్ తాజాగా ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో జర్మనీలోని ప్రజలు టెస్లా కార్లు కొంటారా అని అడిగారు. మార్చి 11న విడుదలైన సర్వే ఫలితాల ప్రకారం లక్ష మంది స్పందించిన వారిలో దాదాపు 94% మంది టెస్లాను కొనడానికి అనుకూలంగా లేరని తేలింది. టెస్లా కారు కొనడంలో తమకు ఎటువంటి సమస్య ఉండదని తెలిపిన వారిలో కేవలం 3% మంది మాత్రమే ఉన్నారు.
ఎలాన్ మస్క్ సూచనల మేరకు..
సర్వేలో పోలైన మొత్తం ఓట్లలో 2.53 లక్షలు లేదా 54% అమెరికాలోని రెండు ఐపీ అడ్రస్ నుండి వచ్చాయని టి-ఆన్‌లైన్ ఇంటర్నల్ దర్యాప్తులో తేలింది. అయితే ఇదంతా ఎలాన్ మస్క్ సూచనల మేరకు జరిగి ఉండవచ్చని సూచిస్తుంది. ఇంకా సర్వే ఫలితాల్లో తారుమారు జరిగే అవకాశం ఉందని టి-ఆన్‌లైన్ చెబుతోంది. అయితే ప్రాథమిక దర్యాప్తు ఫలితాలను అనుసరించి సర్వేను తాత్కాలికంగా నిలిపివేసి సంబంధిత సమాచారాన్ని తొలగించింది. ఇటీవల దక్షిణ ఫ్రెంచ్ నగరమైన టౌలౌస్ సమీపంలో డజనుకి పైగా టెస్లా కార్లకి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 8 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కుట్రలో భాగంగానే కార్లకు నిప్పు పెట్టారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Related Posts
నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం
7.1 magnitude earthquake hits Nepal

న్యూఢిల్లీ: నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో భూకంపం రాగా దాని ప్రభావం ఉత్తర భారతదేశంలో కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ తో పాటు Read more

రతన్ టాటా మృతి పై ప్రముఖుల సంతాపం
ratan tata nomore

అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రతన్ టాటా కన్నుమూశారు.రతన్ టాటా మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాపారవేత్తలు హర్ష గోయెంకా, ఆనంద్ మహీంద్రా, Read more

ఈసీ నిష్పక్షపాతంగా ఉండే వ్యవస్థ : సీఈసీ రాజీవ్ కుమార్
EC is an impartial system .. CEC Rajeev Kumar

ఎవరైనా తప్పు చేస్తే తమ వ్యవస్థ సహించదని వెల్లడి న్యూఢిల్లీ: లోక్‌సభతో పాటు ఆయా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ డేటా తారుమారు అయిందంటూ కొంతకాలంగా విపక్షాలు Read more

స్టాక్స్ లో దూసుకెళ్తున్న అంబానీ
ప్రస్తుతం రిలయన్స్ పవర్ స్టాక్ రూ. 41.72 వద్ద ఉంది. ఇక గత రెండు వారాల నుంచి చూస్తే ఈ స్టాక్ అప్ ట్రెండ్‌లోనే కనిపిస్తుంది

దేశంలోని దిగ్గజ పారిశ్రామిక వేత్తల్లో ఒకరైన అనిల్ అంబానీకి చెందిన పలు స్టాక్స్ గతంలో రికార్డు స్థాయిలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అంబానీ అప్పుల్లో కూరుకుపోవడంతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *