ట్రంప్‌-హార్వర్డ్ విద్యా సంస్థ మధ్య పెరుగుతున్న వివాదాలు

Donald Trump: ట్రంప్‌-హార్వర్డ్ విద్యా సంస్థ మధ్య పెరుగుతున్న వివాదాలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ విదేశీ విద్యార్థులు, వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎవరైనా వర్సిటీ ప్రాంగణాల్లో పాలస్తీనా అనుకూల నినాదాలపై కన్నెర్ర జేస్తున్నారు. ఈ విషయంలో ట్రంప్ చర్యలపై ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ ఢీ అంటే ఢీ అంటోంది. ఆ విశ్వవిద్యాలయానికి అందించే ఫెడరల్‌ నిధులను స్తంభింపజేయాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్వర్డ్‌పై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ, సైద్ధాంతిక, ఉగ్రవాద ప్రేరేపిత వైఖరిని ఇలాగే కొనసాగితే పన్ను మినహాయింపు హోదా రద్దుచేస్తామని హెచ్చరించారు. అంతేకాదు, వర్సిటీని ఓ రాజకీయ సంస్థగా పరిగణించి పన్ను విధిస్తామని బెదిరింపులకు దిగారు. ప్రజాప్రయోజనాలను ఉద్దేశించి పనిచేయడంపైనే పన్ను మినహాయింపు హోదా ఆధారపడి ఉంటుందని ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘హార్వర్డ్ తన విధానాలను మార్చుకోకుంటే పన్ను మినహాయింపును రద్దుచేసి.. రాజకీయ సంస్థగా పన్ను విధిస్తాం’’ అని హెచ్చరించారు.

Advertisements
ట్రంప్‌-హార్వర్డ్ విద్యా సంస్థ మధ్య పెరుగుతున్న వివాదాలు

స్వయంప్రతిపత్తిని దెబ్బ తీసేలా చర్యలు
విద్యార్థుల ఎంపిక, అధ్యాపకుల అధికారాలు వంటి విషయాల్లో స్వతంత్రతకు లోబడి మార్పులు చేయాలని ట్రంప్ యంత్రాంగం కోరుతోంది. కానీ, ఇది తమ యూనివర్సిటీ స్వయంప్రతిపత్తిని దెబ్బ తీస్తుందని హార్వర్డ్ చెబుతోంది. ‘స్వయంప్రతిపత్తి లేదా రాజ్యాంగ హక్కులను చర్చించబోమని, ప్రభుత్వానికి తలవంచబోమని’ విద్యార్థులు, అధ్యాపకులకు రాసిన ఓ లేఖలో హార్వర్డ్ చీఫ్ అలన్ గార్బర్ స్పష్టంగా ప్రకటించారు.
ప్రభుత్వం హార్వర్డ్‌ను కోరిన అంశాలు
ఉద్యోగ నియామకాలు, ప్రవేశాలు, విద్యా కార్యక్రమాల్లో విభిన్నత, సమానత్వం, ఇన్‌క్లూజివ్ ఇనీషియేటివ్ (DEI)ను తొలగించాలి. విశ్వవిద్యాలయ పాలనలో విద్యార్థులు, అధ్యాపకులకు ఉన్న అధికారాలను తగ్గించాలి.
ఈ సూచనలకు అంగీకరించకుంటే హార్వర్డ్‌కు వచ్చే బిలియన్ల డాలర్ల ఫెడరల్ నిధులను కోల్పోవచ్చని ట్రంప్ ప్రభుత్వం గత వారం హెచ్చరించింది. ప్రపంచంలోనే అగ్రగామి విద్యాసంస్థ అయిన హార్వర్డ్.. ట్రంప్ విధానాలను ఖండించింది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి అంగీకరించబోమని స్పష్టం చేసింది.
2.2 బిలియన్ డాలర్ల నిధుల నిలిపివేత
ట్రంప్ ఆధ్వర్యంలోని యూదు వ్యతిరేకతపై ప్రత్యేక బృందం (Joint Task Force to Combat Anti-Semitism) ప్రకటన ప్రకారం హార్వర్డ్‌కు ఇచ్చే 2.2 బిలియన్ డాలర్ల నిధులను నిలిపివేయడం, అదనంగా 60 మిలియన్ డాలర్లు గవర్నమెంట్ కాంట్రాక్టులను ఫ్రీజ్ చేయడం వంటి చర్యలను ప్రకటించింది. ఈ పరిణామాలు అమెరికాలో విద్యా స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు, ప్రభుత్వ అధికార పరిమితులపై పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
సున్నితమైన రాజకీయ సమస్యలపై భిన్నాభిప్రాయాలు
ఇటీవలి సంవత్సరాలలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా ఇజ్రాయేల్-గాజా యుద్ధానికి సంబంధించి పాలస్తీనా అనుకూల ఆందోళనలు పెరిగాయి. ఈ నిరసనలు తీవ్ర విమర్శలకు కేంద్ర బిందువుగా మారాయి. ట్రంప్ యంత్రాంగం ఈ నిరసనలను, సంబంధిత సంఘటనలను క్యాంపస్‌లలో నియంత్రణ లేని యాంటీసెమిటిజానికి నిదర్శనంగా భావిస్తోంది.1964 పౌర హక్కుల చట్టం సెక్షన్ 6 ప్రకారం.. జాతి, రంగు లేదా జాతీయత ఆధారంగా వివక్షను నిషేధించే నిబంధన కింద జోక్యం చేసుకోవడానికి దీన్ని సాకుగా ఉపయోగిస్తోంది. అయితే, ఈ చర్యలు వాక్- స్వేచ్ఛ, ఇజ్రాయేల్ విధానాలపై చట్టబద్ధమైన విమర్శలను అణచివేయడానికి తీసుకొచ్చారని విమర్శకులు అంటున్నారు. ఈ వివాదం విశ్వవిద్యాలయాలు సున్నితమైన రాజకీయ సమస్యలపై భిన్నాభిప్రాయాలను నిర్వహిస్తూనే, సురక్షితమైన, వివక్ష రహిత వాతావరణాన్ని ఎలా నిర్ధారించాలనే సంక్లిష్ట సవాల్ ఎత్తి చూపుతుంది.

Read Also: Donald Trump: స్వీయ బహిష్కరణ చేసుకున్న వారికీ ట్రంప్ బిగ్ ఆఫర్

Related Posts
త్వరలో ఏపీలో ‘హ్యాపీ సండే’: చంద్రబాబు
ఏపీ యువతకు చంద్రబాబు శుభవార్త

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ..ఉగాది రోజున ‘పీ4’ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. ఏపీలో త్వరలో ‘హ్యాపీ సండే’ కూడా ప్రారంభిస్తామని, మనుషుల Read more

Reservoirs : అడుగంటుతున్న ప్రాజెక్టులు
Reservoirs

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాలు వేసవి తీవ్రతతో నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉమ్మడి జలాశయాల్లో నీటి నిల్వలు రోజురోజుకీ గణనీయంగా తగ్గిపోతున్నాయి. కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం Read more

ఏపీ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిలు
AP High Court has two new j

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇద్దరు కొత్త అడిషనల్ జడ్జిలను నియమించారు. అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావులను ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము Read more

Yashaswini Reddy: అత్తాకోడళ్లు అని మాట్లాడితే సహించేదిలేదు: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
Yashaswini Reddy: అత్తాకోడళ్లు అని మాట్లాడితే సహించేదిలేదు: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అత్తాకోడళ్ల సీరియళ్లు ఆసక్తికరంగా ఉంటాయి అన్న Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×