lokesh

గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, జట్టు డిల్లీలో ఏమంత్రి నారా లోకేశ్‌ను కలిశారు

గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, కంట్రీ డైరెక్టర్ (పబ్లిక్ సెక్టార్ అండ్ ఎడ్ టెక్) ఆశిష్, వారి బృందాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ డిల్లీలో కలిశారు.

ఈ సందర్భంగా విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేయబోయే డేటా సిటీకి సంబంధించి చర్చించారు. ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన అనుమతులు, భూ కేటాయింపులు, పాలసీని త్వరితగతిన ఇస్తామని, ఇందుకోసం ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు చురుగ్గా పని చేస్తోందని చెప్పారు. డేటా సిటీ ఏర్పాటును కంపెనీ తరపున వేగవంతం చేయాలని, దీనివల్ల విశాఖ ఐటి ముఖచిత్రం మారుతుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

AIలో ప్రపంచ స్థాయి అప్లికేషన్‌ లను రూపొందించడానికి, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకు గూగుల్ డేటా సిటీ గేమ్ ఛేంజర్ కానుందన్నారు. డేటా సిటీ పనుల వేగవంతానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు గూగుల్ క్లౌడ్ ఎండి.

Related Posts
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ భారీ కటౌట్
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ భారీ కటౌట్

RRRతో గ్లోబల్ స్టార్ అయినా రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పొలిటికల్ డ్రామా గేమ్ ఛేంజర్ విడుదలకు సన్నద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన Read more

ఫ్రీ బస్‌పై చిత్తశుద్ధి లేదు : వైఎస్‌ షర్మిల
sharmila

మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. టీడీపీ , జనసేన పార్టీలకు కాలయాపన తప్పా Read more

Tirumala : టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం
Tirumala : టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం

టీటీడీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సర్వత్తరా విమర్శలు వస్తున్న నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల Read more

అనంతపురంలో పరువు హత్య?
honor killing

భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నా, పరువు కోసం జరుగుతున్న హత్యలు ఇంకా సమాజాన్ని కలవరపెడుతున్నాయి. కుటుంబ పరువు, సంప్రదాయాల పేరుతో తల్లిదండ్రులే తమ పిల్లల Read more