Andhra Pradesh: ఏపీకి శుభవార్త త్వరలోనే మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ ప్రారంభం ఎక్కడంటే!

Andhra Pradesh: ఏపీకి శుభవార్త త్వరలోనే మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ ప్రారంభం ఎక్కడంటే!

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే కొన్ని రోజులుగా కృష్ణా జిల్లా నాగాయలంకలో ఏర్పాటు చేయబోయే మిస్సైల్ టెస్టింగ్ సెంటర్‌ను పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారనే వార్తలు జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఈ ప్రచారాలకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది.ఈ ప్రాజెక్టును ఏపీలోనే కొనసాగిస్తామని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.దీంతో కృష్ణా జిల్లాలోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం ఏర్పాటు కాబోతుందనే దానిపై స్పష్టత వచ్చింది.

Advertisements

అనువైన ప్రాంతం

ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అనువైన ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది.ఇందులో భాగంగానే 2011లో ఏపీకి ఈ ప్రాజెక్టును కేటాయించింది.అప్పట్లోనే ఈ మిస్సైల్ సెంటర్ నిర్మాణానికి కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామం అనువైన ప్రాంతంగా కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఈ గ్రామం సముద్రతీర ప్రాంతంలో ఉండటం, గ్రామం చుట్టుపక్కల 6-8కిలోమీటర్ల మేర ఎలాంటి జనావాసాలు లేకపోవడంతో మిస్సైల్ టెస్టింగ్‌ ప్రయోగాలకు ఈ గ్రామం అనుకూలంగా ఉంటుందనే భావనకు వచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇది కాస్తా ఆలస్యమైంది. ఇక ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత 2017లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం 300 ఎకరాలకుపైగా భూమిని డీఆర్‌డీవో కు కేటాయించింది. అయితే పర్యావరణ అనుమతులు , ఇతర అడ్డంకుల కారణంగా కొన్నేళ్లపాటు ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైంది. దీంతో 2019లో పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు లభించడంతో 2021లో ఆ స్థలాన్ని డీఆర్‌డీవో స్వాధీనం చేసుకొంది. ప్రాజెక్టుకు కేటాయించిన ప్రాంతం చుట్టూ ప్రహారి గోడను నిర్మించింది. కానీ ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన మాత్రం జరగలేదు. అయితే ఈ ఏడాది జనవరిలోనే ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో ఈ కేంద్రానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేయగా చివరి నిమిషంలో రద్దైనట్టు అధికారులు తెలిపారు. ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కావడంతో ప్రధాని మోదీయే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. అయితే అమరావతి నిర్మాణ పనుల శంకుస్థాపనతో పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా మోదీ ప్రారంభించనున్నట్టు సమాచారం.

 Andhra Pradesh: ఏపీకి శుభవార్త త్వరలోనే మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ ప్రారంభం ఎక్కడంటే!

రెండవ ప్రధాన క్షిపణి

ఈ మిస్సైల్‌ టెస్టింగ్ సెంటర్ నిర్మాణం పూర్తయితే, ఇది ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ తర్వాత భారతదేశంలో రెండవ ప్రధాన క్షిపణి పరీక్షా కేంద్రంగా మారుతుంది. ఇది షార్ట్-రేంజ్ లాంగ్-రేంజ్ క్షిపణుల పరీక్షలకు సహాయపడుతుంది, దీనివల్ల భారత రక్షణ రంగంలో స్వావలంబన ,సాంకేతిక పురోగతి సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టు స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని ఏపీ ప్రజలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Related Posts
Syamala: వైసీపీ నాయకురాలు శ్యామల పై క్రిమినల్ కేసులు
వైసీపీ నాయకురాలు శ్యామల

ప్రముఖ యూట్యూబర్లపై బెట్టింగ్ కేసులు – పోలీసుల విచారణ ప్రారంభం హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార Read more

ICC అరెస్ట్ వారెంట్లు: ఇజ్రాయెల్ ప్రధాని, మంత్రి, హమాస్ చీఫ్‌పై నేరాల ఆరోపణలు
arrest warrant

అంతర్జాతీయ నేరన్యాయమాన్య కోర్టు (ICC) ఈ గురువారం, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మరియు మాజీ రక్షణ మంత్రి యోవ్ గలాంట్ పై "మానవ హక్కుల ఉల్లంఘన" Read more

పిల్లర్లు లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం?
బిగ్ అప్డేట్.

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కొత్త మార్గాన్ని అన్వేషిస్తోంది. సిమెంట్, స్టీల్ ఖర్చును తగ్గించేందుకు పిల్లర్లు లేకుండానే ఇళ్లను నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా, ఇళ్ల Read more

హైకోర్టుకు ఆర్జీ కార్ కేసు: మరణశిక్ష డిమాండ్
హైకోర్టుకు ఆర్జీ కార్ కేసు: మరణశిక్ష డిమాండ్

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించి, ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ జూనియర్ డాక్టర్ అత్యాచారం మరియు హత్య కేసులో సంజయ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×