యూఎస్ పౌరసత్వం కోసం "గోల్డ్ కార్డ్" వీసాలు

యూఎస్ పౌరసత్వం కోసం “గోల్డ్ కార్డ్” వీసాలు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంపన్న వలసదారులు అందరికీ శుభవార్త చెబుతూ.. అమెరికాలో పౌరసత్వం పొందేందుకు ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించారు. EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ స్థానంలో గోల్డ్ కార్డ్ వీసాను ఇవ్వబోతున్నట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే దీన్ని పొందాలనుకునేవారు 5 మిలియన్ల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందని కూడా వెల్లడించారు. దీని వల్ల తమ దేశ ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. మరి ఈ గోల్డ్ కార్డ్ వీసా ఏంటి, దీనికి అర్హులు ఎవరో ఆ వివరాలు మీకోసం.

యూఎస్ పౌరసత్వం కోసం "గోల్డ్ కార్డ్" వీసాలు


అందుబాటులో గోల్డ్ కార్డ్ వీసా
పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ వల్ల అనేక మోసాలు, అక్రమాలు జరుగుతుండగా.. వాటన్నిటికీ అమెరికా సర్కారు చెక్ పెట్టింది. ముఖ్యంగా EB-5 వీసా ప్రోగ్రామ్ స్థానంలోకి గోల్డ్ కార్డ్ వీసాను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు నేరగా యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. అయితే 5 మిలియన్ల డాలర్లు చెల్లించి ఈ వీసాను కొనుగోలు చేసుకోవచ్చని వివరించారు. ఈ వీసాను పొందిన వాళ్లు అమెరికాలో మరింత ధనవంతులు అవుతారని కూడా ట్రంప్ వెల్లడించారు. గోల్డ్ కార్డ్ వీసా దారుల అనేక విజయాలు సాధిస్తారని, వారు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో పన్నులు కూడా చెల్లిస్తారని ట్రంప్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వీరి వల్ల దేశం రుణం తగ్గుతుందని వివరించారు.
అక్రమాలను అరికట్టేందుకు ఈ వీసాలు
అలాగే దీనిపై వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్ని స్పందిస్తూ.. మరో రెండు వారాల్లో EB-5 వీసాలను ట్రంప్ గోల్డ్ కార్డులతో భర్తీ చేస్తామని చెప్పారు. ఇది కూడా ఒక రకంగా శాశ్వత నివాస హోదా కల్పించే గోల్డ్ కార్డు లాంటిదేనన్నారు. EB-5 ప్రోగ్రామ్ వల్ల జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకు వస్తున్నట్లు వివరించారు.

Related Posts
యూఎస్‌లో కొత్త ఎంపాక్స్ వేరియంట్ కేసు: ఆరోగ్య అధికారులు జాగ్రత్తలు
mpox

యూఎస్‌లో ఎంపాక్స్ అనే అరుదైన వ్యాధి కొత్త వేరియంట్‌తో మొదటిసారి గుర్తించబడింది. ఈ వ్యాధి స్మాల్ పాక్స్ (Smallpox) వైరస్ కుటుంబానికి చెందినది, మరియు ఇది మనిషికి Read more

మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం
woman constable

యూపీ లోని కాన్పూర్‌లో ఒక మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం జరిగింది. అయోధ్యలో విధులు నిర్వహిస్తున్న 34 సంవత్సరాల మహిళా కానిస్టేబుల్ కర్వా చౌత్ జరుపుకునేందుకు కాన్పూర్ బయలుదేరారు. Read more

భద్రతా సమావేశంలో నెతన్యాహు కీలక చర్చ
netanyahu

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు సఫెద్‌లోని ఐడీఎఫ్ ఉత్తర కమాండ్ ప్రధాన కార్యాలయంలో తన భద్రతా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అనేక Read more

నేడే హరియాణా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
haryana jammu kashmir elect

హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *