చైనా అధికారిక మీడియా సంస్థలైన గ్లోబల్ టైమ్స్ (Global Times), జిన్హువా ఎక్స్(X) ఖాతాలను కేంద్ర ప్రభుత్వం (Central Government) భారత్(India) లో బ్లాక్ చేసింది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని పోస్టు చేసినందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ వారం మొదటిలోనే బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం గ్లోబల్ టైమ్స్‌ను హెచ్చరించినట్లు తెలిసింది. ఎక్స్‌లో పోస్టు చేసిన సమాచారాన్ని పున:పరిశీలించుకోవాలని, తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని ఎక్స్ ద్వారా హితవు పలికింది.

ఎక్స్ ఖాతాల్లో తప్పుడు ప్రచారం
పాకిస్థాన్‌కు సానుభూతి చూపే పలు ఎక్స్ ఖాతాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఎలాంటి ఆధారాలు లేకుండానే విచ్చలవిడిగా పోస్టులు చేస్తూ, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయని భారత రాయబార కార్యాలయం మరో పోస్టులో వివరించింది. బాధ్యతాయుతమైన మీడియా సంస్థలు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం సరికాదని, అది జర్నలిస్టు విలువలను కాలరాయడమేనని పేర్కొంది.
చైనా కవ్వింపు చర్యలకు భారత్ కౌంటర్
చైనా మరోసారి భారత్‌ను కవ్వించేందుకు ప్రయత్నించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రదేశాలకు చైనా కొత్త పేర్లు పెట్టింది. వాటిని దక్షిణ టిబెట్‌లోని ప్రాంతాలుగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే చైనాకు భారత్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్‌కు చైనా పేర్లు పెట్టిన అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన కేంద్రం- గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతాను విత్‌హెల్డ్‌లో పెట్టింది. ఇదే కారణాలతో చైనాకు చెందిన XH న్యూస్, తుర్కియేకు చెందిన టీఆర్టీ వరల్డ్‌ను కూడా విత్‌హెల్డ్‌లో పెట్టింది.
“అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రదేశాల పేర్లు మార్పు
“అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రదేశాల పేర్లు మార్చడానికి చైనా వ్యర్థమైన, పిచ్చి ప్రయత్నాలు చేస్తోందని మేము గమనించాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అరుణాచల్‌ప్రదేశ్ అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగా ఉంది, ఇకపైనా ఉంటుంది. ఆ వాస్తవానికి ఎవరూ మార్చలేరు, తిరస్కరించలేరు” – రణధీర్ జైస్వాల్, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ
చైనా గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేసింది. కానీ ప్రతిసారీ చైనా దుష్ట ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా అడ్డుకుంది.
Read Also: Indian Origin Student: కరీబియన్ దేశంలో భారత సంతతి విద్యార్థి మృతి