Markets: తేరుకున్న ప్రపంచ మార్కెట్లు

Markets: తేరుకున్న ప్రపంచ మార్కెట్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. శత్రు, మిత్ర దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాల ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తూ అమెరికా కఠిన వైఖరి చూపిస్తోంది. టారిఫ్‌ల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం ఖాయం కావడంతో, అమెరికాలో ప్రజలు షాపింగ్ మాల్స్ వద్ద క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు,ఇంటికి సంబందించిన వస్తువుల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన టారిఫ్‌లు ఏప్రిల్ 5 నుంచి అమలులోకి వచ్చాయి. ప్రారంభంలో 10 శాతం సుంకాలు విధించినప్పటికీ, మిగతా భాగాన్ని ఏప్రిల్ 10 నుంచి వసూలు చేస్తామని వెల్లడించింది.అయితే, కొన్ని దిగుమతులకు మే 27 వరకు గ్రేస్ పీరియడ్ ఉండటంతో ఆ లోపు సరుకులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత మొదలైంది. రెవెన్యూ సర్వీసుల నుంచి 20 వేల మంది తొలగించారు. ఖర్చులు తగ్గించుకునేందుకే ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. టారిఫ్ బాదుడు, ట్యాక్సులతో ట్రంప్ కంపెనీ నడుపుతున్నారా? కంట్రీని నడుపుతున్నారా అనే అనుమానం కలిగిస్తోంది. అటు ట్రంప్‌ కార్పోరేట్‌ కల్చర్‌తో అమెరికాలోను హాట్‌ టాఫిక్‌గా మారింది. ట్రంప్‌ టారిఫ్‌లతో ఆర్థికవేత్తలే కాదు యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది.ఈ నేపథ్యంలో నిన్న దేశీయ మార్కెట్లు ఊహించనంతగా కుప్పకూలాయి.ట్రంప్ టారిఫ్ విధానాల కారణంగా గత సెషన్‌లో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు నేడు పుంజుకుంటున్నాయి.

Advertisements

స్టాక్ మార్కెట్లు

ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా నేడు కోలుకున్నాయి. నేటి సెషన్‌లో యూఎస్ మార్కెట్లు కూడా లాభపడతాయని భావిస్తున్నారు.ట్రంప్ ప్రకటనల ప్రభావం నుంచి మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. ట్రంప్ టారిఫ్ విధానాల కారణంగా గత సెషన్‌లో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు నేడు పుంజుకుంటున్నాయి. సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించగా, నిఫ్టీ మళ్లీ 22,500 మార్కుకు ఎగబాకింది. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 1180.73 పాయింట్లు లాభపడి 74,318.63 వద్ద, నిఫ్టీ 361 పాయింట్ల లాభంతో 22,522.60 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.  కాగా, నిన్న దేశీయ మార్కెట్లు ఊహించనంతగా కుప్పకూలాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2,226 పాయింట్ల నష్టంతో 73,137కి దిగజారింది. నిఫ్టీ 742 పాయింట్లు కోల్పోయి 22,161కి పతనమైంది. 

ఆర్థికవేత్తలు ఆందోళన

ట్రంప్ చర్యలతో ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుంకాల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు మాజీ అధ్యక్షుడు ఒబామా. ట్రంప్‌ టారిఫ్‌లతో అమెరికాకు ఒరిగేదేం లేదన్నారు. తాజా పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు ఒబామా. 

Read Also: South Korea: దక్షిణ కొరియాలో పదవీచ్యుతుడైన అధ్యక్షుడి స్థానంలో ఎన్నికలు

Related Posts
ట్రంప్ అధికారంలో ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగుస్తుంది: జెలెన్స్కీ
trump zelensky

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైతే, ఉక్రెయిన్-రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోతుందని ,అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తరువాత ఆయనతో Read more

SunithaWilliams :సునీత విలియమ్స్ ను భారతదేశానికి రావాలని కోరిన ప్రధాని మోదీ
SunithaWilliams :సునీత విలియమ్స్ ను భారతదేశానికి రావాలని కోరిన ప్రధాని మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్  రాసిన లేఖలో ‘మీరు వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, మా హృదయాలకు చాలా Read more

electric tower: ఆ భార్యకు ఎంత కష్టం వచ్చిందో టవర్ ఎక్కేసింది…చివరికి కాపాడిన పోలీసులు
Electric Tower: ఆ భార్యకు ఎంత కష్టం వచ్చిందో టవర్ ఎక్కేసింది...చివరికి కాపాడిన పోలీసులు

ప్రయాగ్‌రాజ్‌లో సంచలనం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. భర్తతో తలెత్తిన గొడవ కారణంగా ఓ మహిళ తీవ్ర ఆవేశానికి లోనైంది. కోపంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని Read more

అక్రమ వలసదారులతో ల్యాండ్ అయిన అమెరికా విమానం
అక్రమ వలసదారులతో ల్యాండ్ అయిన అమెరికా విమానం

అమెరికా ప్రభుత్వం అక్రమంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి పంపే ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా, 116 మంది భారతీయులను తీసుకువచ్చిన అమెరికా మిలటరీ విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×