ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ 14 ఏళ్ల బాలికను నిర్బంధించి నాలుగు రోజులపాటు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఈ నెల 9న పక్కింటి మహిళతో కలిసి వీరపనేనిగూడెం గ్రామానికి వచ్చింది. అయితే 13వ తేదీన ఏదో వివాదం కారణంగా ఆ ఇంటినుంచి బయటకు వచ్చేసింది.బాలిక ఒంటరిగా బయటకు రావడాన్ని గమనించిన 15 ఏళ్ల బాలుడు, రజాక్ అనే మరో యువకుడు బాలిక వద్దకు వెళ్లి బైక్‌పై జి.కొండూరులో దింపుతామని నమ్మించి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను అనిల్, జితేంద్ర అనే ఇద్దరు యువకుల వద్దకు తీసుకెళ్లారు. వారు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆపై కేసరపల్లికి చెందిన అనిత్, హర్షవర్ధన్, మరో యువకుడు కూడా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా నాలుగు రోజులపాటు ఆమెపై దారుణానికి పాల్పడ్డారు.ఆమెను ఆటోలో తీసుకొచ్చి మాచవరంలో వదిలిపెట్టారు.
బాలికను కాపాడిన ఆటో డ్రైవర్
ఆమె పరిస్థితి చూసి అనుమానించిన ఓ ఆటోడ్రైవర్ వివరాలు కనుక్కొని మాచవరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి బాలికను అప్పగించాడు. ఆమె మాట్లాడలేని స్థితిలో ఉండటంతో పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కేసు నమోదు
బాలిక మాట్లాడలేని స్థితిలో ఉండటంతో, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె నుంచి ప్రాథమిక సమాచారం సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అభం శుభం తెలియని బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలి అనే వాదన బలంగా వినిపిస్తోంది.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, మహిళా భద్రతపై మరింత కఠినమైన చట్టాలు అమలు చేయాలి. బాధితురాలికి సమాజం అండగా ఉండి, ఆమెకు న్యాయం జరగేలా చేయాల్సిన అవసరం ఉంది.ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.మహిళల భద్రతపై అవగాహన కల్పించాలి – ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రమాద పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, స్వీయరక్షణ ఎలా చేసుకోవాలి అనే అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.