game changer talk

‘గేమ్ ఛేంజర్’ పబ్లిక్ టాక్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కలయికలో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్‘. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ ఈరోజు జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. దీంతో సినిమా చూసిన మెగా అభిమానులు , సినీ లవర్స్ సినిమా ఎలా ఉంది..? చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది…? శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది..? ఓవరాల్ గా సినిమా టాక్ ఏంటి అనే విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

స్టోరీ టెల్లింగ్, స్టెల్లర్ ఫెర్ఫార్మెన్స్, టాప్ ఫెర్ఫార్మెన్స్, అద్బుతమైన సినిమాటిక్ ఎక్సీపిరియెన్స్‌ మూవీకి అదనపు ఆకర్షణ. రాంచరణ్ ఫెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉంది. ఎస్‌జే సూర్య అవుట్ స్టాండింగ్. కియారా అద్వానీ, అంజలి ఫెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. విజువల్స్ అద్బుతంగా ఉన్నాయి. IASగా చరణ్ లుక్, యాక్టింగ్ అదిరిపోయాయని, ఇంటర్వెల్లో ఊహించని ట్విస్ట్ సెకండాప్ హాఫ్ ఫై మరింత హైప్ పెంచుతుంది. కమెడియన్లందరూ ఉన్నా కామెడీ లేకపోవడం మైనస్. తమన్ BGM బాగుందని ఇలా నెటిజన్లు ఎవరికీ వారు రివ్యూలు ఇస్తున్నారు. ఓవరాల్ గా ‘గేమ్ ఛేంజర్’ ఒక మాస్ ఎంటర్టైనర్. రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమాను చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అని ఫైనల్ టాక్ ఇస్తున్నారు.

Related Posts
పాకిస్థాన్‌పై 15 వేల తాలిబాన్ యోధుల దాడి!
పాకిస్థాన్‌పై 15 వేల తాలిబాన్ యోధుల దాడి!

పాకిస్థాన్‌పై 15 వేల తాలిబాన్ యోధుల దాడి! ఏందుకు? పాకిస్తాన్ దశాబ్దాలుగా, వ్యూహాత్మక కారణాలతో తాలిబాన్‌లను పెంచి పోషించింది. చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తించి, సైనిక సహాయాన్ని అందించింది. Read more

Firing: మాజీ ఎమ్మెల్యేపై దుండగుల కాల్పులు
హోలీ రోజున మాజీ ఎమ్మెల్యేపై దుండగుల కాల్పులు – హిమాచల్‌లో కలకలం!

హోలీ పండుగ రోజున హిమాచల్ ప్రదేశ్‌లో అశాంతి నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్‌పై దుండగులు దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. Read more

మళ్ళీ ఓ సినిమా లో నటిస్తున్న తమన్
మళ్ళీ ఓ సినిమా లో నటిస్తున్న తమన్

ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్, 2003లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'బాయ్స్' చిత్రంలో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ చిత్రంలో హీరో సిద్ధార్థ్ స్నేహితుడిగా Read more

గిరిజన యువతపై కేసులు ఉపసంహరించిన సిఎం
గిరిజన యువతపై కేసులు ఉపసంహరించిన సిఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొమురం భీమ్ జయంతి, వర్ధంతి వేడుకలు, నిరసనలకు సంబంధించిన అరెస్టులకు సంబంధించిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. గిరిజన విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఆర్థిక Read more