'Game changer' police instr

‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ విడుదల ఫిక్స్..?

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కలయికలో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్‘. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు.

తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకొని..ఫైనల్ గా ప్లాప్ బారినపడింది. ఇక ఇప్పుడు ఓటిటి లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ చిత్రం ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవగా 5 వారాలు పూర్తయ్యాక ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 14వ తేదీన స్ట్రీమింగ్ కు వస్తుందని అంచనా వేశాయి. ఈ చిత్ర ఓటీటీ హక్కులను ‘అమెజాన్ ప్రైమ్’ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి థియేటర్స్ లో పెద్దగా సందడి చేయలేకపోయినా ఈ మూవీ..OTT ప్రేక్షకులను ఈమేరకు అలరిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *