గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్‘. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ నిన్న జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
తొలిరోజు ఈ మూవీ రూ.47.13 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు హిందూస్థాన్ టైమ్స్ పేర్కొంది. తెలుగులో రూ.38 కోట్లు, హిందీలో రూ.7 కోట్లు, తమిళ్ రూ.2 కోట్లు వసూలు చేసినట్లు తెలిపింది. మార్నింగ్ షోల్లో 55.82%, మ్యాట్నీలో 39.33%, ఈవెనింగ్ షోల్లో 50.53% ఆక్యుపెన్సీ నమోదు చేసిందని వెల్లడించింది. సినిమా లో సాంగ్స్ మైనస్ గా ఉండడం , స్టోరీ కూడా పాత స్టోరీ లగే అనిపిస్తుండడం , సాగదీత సన్నివేశాలు సినిమాకు మైనస్ అవ్వడం వల్ల మిక్స్డ్ టాక్ వస్తుంది. ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ ఖర్చే పెట్టాడు. మరి అవన్నీ వస్తాయా అంటే కష్టమే అని అంటున్నారు సినీ విశ్లేషకులు.