పోప్ ఫ్రాన్సిస్ గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. క్రైస్తవ మతస్థుల నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన కుల, మతాలకు అతీతంగా ఎంతో మంది ప్రేమను సంపాదించుకున్నారు. పోప్ లాంటి అత్యున్నతమైన స్థానంలో ఉన్నా.. ఆడంబరాలకు దూరంగా సాధారణ జీవితం గడిపారు. అవును.. పోప్ స్థానంలో విలాసవంతమైన జీవితం గడిపేందుకు అవకాశం ఉన్నా.. వాటికి దూరంగా ఉన్నారు. నిత్యం ప్రజలకు దగ్గరగా ఉన్నారు. అలా వారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. అందుకే పోప్ ఫ్రాన్సిస్ నడిచిన మార్గం ఎంతో మందికి ఆదర్శం.
మానవతావాదిగానే ఎక్కువగా గుర్తింపు
క్రైస్తవ మతపెద్దగా అత్యున్నతమైన పదవిలో ఉన్నా.. పోప్ ఫ్రాన్సిస్‌కు ఓ మానవతావాదిగానే ఎక్కువగా గుర్తింపు దక్కింది. నిజమైన మానవతావాదిగా.. కరుణకు, విశ్వశాంతికి గొంతుకగా నిలిచారు. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇది కేవలం ఒక మత పెద్ద గొప్పతనం గురించి కాదు.. ఒక మానవతావాది జీవితం. ‘మనం ఉండే స్థితితో మనకు గొప్పతనం రాదు.. మన మనసుతో మనం గొప్పవాళ్లం అవుతాం. ప్రేమ, మానవత్వం మతాలను మించి ఉంటాయి’ – పోప్ ఫ్రాన్సిస్.

మతం కాదు మానవత్వం గొప్పదని చాటి చెప్పిన మనిషి
ఇలా మాటల్లో చెప్పడం మాత్రమే కాదు.. జీవితంలో కూడా ఆచరించి చూపిన వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్.. మతం కాదు మానవత్వం గొప్పదని చాటి చెప్పిన మహా మనిషి. ఆయన ప్రజలకు దగ్గరిగా, వారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.. అందుకే పోప్ ఫ్రాన్సిస్ నడిచిన మార్గం ఎంతోమందికి ఆదర్శం.
2013 నుంచి రోమన్ క్యాథలిక్ చర్చికి అధిపతిగా ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన గొప్ప ఆధ్యాత్మిక గురువు. ఉన్నతమైన స్థానంలో ఉంటూనే.. సంప్రదాయాలను దాటి ఆయన చూపిన వినూత్నమైన మార్గం, వ్యక్తిత్వం, దృక్పథం అందరినీ ఆకట్టుకున్నాయి.
Read Also: Pope Francis: సంప్రదాయానికి భిన్నంగా పోప్ ఫ్రాన్సిస్ ఖననం