అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హత్యకు కుట్ర జరుగుతోందా? ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ (Director James kamii) సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఇదే చర్చను లేవనెత్తింది. ఆయన సోషల్ మీడియా పోస్ట్ దుమారం రేపడంతో అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థలు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశాయి. మరోవైపు, తన పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని కామీ వివరణ ఇచ్చారు. జేమ్స్ కామీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘86 47’ అనే అంకెలను పోస్ట్ చేసి, కొద్దిసేపటికే దానిని తొలగించారు. అయితే, ‘47వ అధ్యక్షుడిని చంపడం’ (47th President killed) అనే అర్థం వచ్చేలా ఈ రహస్య కోడ్ ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వివాదాస్పద పోస్ట్‌పై అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని హోంల్యాండ్ (Home land)సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ అధికారికంగా వెల్లడించారు.

హింస అంటేనే తనకు ఇష్టం లేదు
ఈ ఆరోపణలపై జేమ్స్ కామీ స్పందించారు. తాను బీచ్‌లో నడుస్తున్నప్పుడు కనిపించిన కొన్ని గవ్వల (షెల్స్) చిత్రాన్ని పోస్ట్ చేశానని, ఆ పోస్ట్‌లోని అంకెలను అధికారులు తప్పుగా అన్వయించుకున్నారని తెలిపారు. ఆ అంకెలను కొందరు హత్యలకు సంకేతంగా ఉపయోగిస్తారనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిని చంపాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, హింస అంటేనే తనకు ఇష్టం ఉండదని కామీ అన్నారు. కాగా, గతంలో డొనాల్డ్ ట్రంప్‌పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. గతేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఓ సభలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ భవనంపై నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు
Read Also: Pakistan: శాంతి స్థాపన కోసం భారత్‌తో చర్చలు నిర్వహిస్తాం : షెహబాజ్ షరీఫ్