మర్రిగూడ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఉన్న గుట్టలు, శివన్నగూడెం ప్రాజెక్టు కాలువ త్రవ్వకాలు వేటగాళ్లకు నిలయాలుగా మారి, జాతీయ పక్షి నెమళ్లు, అడవి పందులను ఇష్టానుసారంగా చంపినప్పటికీ, ఇక్కడ కనీసం ఆరు నెలలుగా అటవీశాఖ అధికారులు కానీ, సంబంధిత అధికారులు గానీ పట్టించుకోకపోవడం విడ్డూరంగా మారిందని, సంఘటన స్థలంలోని ఆహుతులు విడ్డూరం వ్యక్తం చేస్తున్నారు. ఎరుగండ్లపల్లి, రాజపేటతండా, వట్టిపల్లి, కొండూరు, గ్రామపంచాయతీల రెవెన్యూ భూములలో ఈ సంఘటనలు చోటు చేసుకోవడం కోకొల్లలు.
విద్యుత్ సరఫరా రాత్రి వేళల్లో అర్ధాంతరంగా నిలిచిపోవడానికి పందులను సంహరించడానికి వినియోగిస్తున్న కరెంట్ తీగలే కారణమని, గతంలో విద్యుత్తు సంబంధిత అధికారుల నుండి బట్టబయలు అయింది.. జాతీయ పక్షులు నెమల్లను మట్టుపెట్టడానికి, ఉచ్చులు, కరెంటు, విషతుల్యమైన ఆహారాన్ని వినియోగిస్తున్నారని మండల వ్యాప్తంగా పలు ఆరోపణలు ఉన్నాయి.. ఇటీవల చంపబడిన జాతీయ పక్షి నెమళ్ళ అవశేషాలు, ఈకలు అటవీ పందులను మాడ్చిన జాడలు కనిపించడంతో, అసలు నిజాలు బట్టబయలయ్యాయి..

శివన్నగూడెం రిజర్వాయర్ కోసం తవ్విన కాలువల్లో జాతీయ పక్షి నెమలి ఈకలు చూపరుల మనసును కలచి వేస్తుంది.. వేటగాళ్ల వారి కోడ్ భాషలో హెలిక్యాప్టర్ దొరికింది కావాలా అంటూ ఫోన్ లు చేసుకోవటం సాంప్రదాయంగా మారింది. వీటితో పాటు ఉడుములు, పక్షులు, జింకలను సైతం వేటాడుతున్నారని సమాచారం. అడవి పందుల నాటు బాంబులు తయారు చెయ్యటంలో, మర్రిగూడ మండల పరిధిలోని గట్టుప్పల్ మార్గాన ఓ గ్రామంలో విచ్చలవిడిగా తయారు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం..
బహిర్గతంగానే మంచాలపై వాటిని ఎండబెడుతూ, ప్రజలను సైతం భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.. ఉచ్చులు, రాత్రిపూట లైట్ లు, నాటు బాంబులతో అనేక అటవి జంతువులు కనుమరుగవుతున్నాయి.. మార్కెట్ లో అడవి జంతువుల మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, వేటగాళ్లకు పట్టిందే బంగారంగా మారింది. ఇంత జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు మాకేమీ సంబంధం లేదనే విధంగా ప్రవర్తిస్తున్న తీరు, సభ్యసమాజం తలదించుకునేలా కనపడుతుంది.
Read Also: Farmers: వడగండ్ల వానతో రైతులకు పెద్ద నష్టం!