వీసా రద్దును సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించిన విదేశీ విద్యార్థులు

America: వీసా రద్దును సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించిన విదేశీ విద్యార్థులు

అమెరికా విదేశాంగ శాఖ వీసాలు రద్దు చేయటాన్ని సవాల్‌ చేస్తూ పలువురు విదేశీ విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. అకస్మాత్తుగా వీసాలు రద్దు చేయడంతో చదువులు కొనసాగించలేకపోతున్నామని, తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు సహా మేరీల్యాండ్, ఒహియో స్టేట్ వంటి ప్రఖ్యాత ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్య అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు కోర్టును ఆశ్రయించిన వారిలో ఉన్నారు.

Advertisements
వీసా రద్దును సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించిన విదేశీ విద్యార్థులు

హమాస్‌కు మద్దతు పలికిన విద్యార్థుల వీసాల రద్దు
హమాస్‌కు మద్దతుగా జరిగిన క్యాంపస్‌ ఆందోళనల్లో పాల్గొన్నారంటూ కొందరు విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్‌ సర్కార్‌ రద్దు చేసింది. అయితే ఆందోళనల్లో పాల్గొనని విద్యార్థుల వీసాలు కూడా రద్దయినట్లు కళాశాలలు పేర్కొంటున్నాయి. కొందరు విద్యార్థులు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడినందుకు వీసా రద్దు చేసినట్లు చెప్తుండగా, మరికొందరి విషయంలో అధికారులు సరైన కారణాలు చెప్పటం లేదని బాధితులు కోర్టుకు విన్నవించారు. ఇలాంటి కారణాలతో వీసాలు రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి లేదని విద్యార్థులు వాదిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో జాతి వ్యతిరేక సందేశాలపై చర్యలు
క్యాంపస్‌ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన విద్యార్థులతోపాటు, అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన వారిని కూడా ట్రంప్ సర్కార్​ దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. తరువాత పలు యూనివర్సిటీ విద్యార్థుల వీసాలను కూడా రద్దు చేసింది. చట్టబద్దమైన పత్రాలు లేని విద్యార్థులను, హమాస్‌ లాంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తున్న విదేశీ విద్యార్థులను దేశం నుంచి బహిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్‌ పలుమార్లు పేర్కొన్నారు. ఇప్పుడు అన్నంత పని చేశారు.
ఎఫ్​1 వీసా కు కావలిసిన అర్హతలు
అమెరికాలో విద్య అభ్యసించాలంటే విదేశీ విద్యార్థులు ఎఫ్​1 వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అమెరికాలోని ఓ విద్యా సంస్థలో ప్రవేశం పొందిన తరువాత, విద్యార్థులు అమెరికా రాయబార కార్యాలయంలో లేదా విదేశాల్లోని కాన్సులేట్​ల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆర్థిక వనరులను నిరూపించుకోవాలి
అయితే ఇలా ఎఫ్​1 వీసా పొందాలంటే, విద్యార్థులు తమ చదువుకయ్యే ఆర్థిక వనరులు తమ దగ్గర ఉన్నాయని నిరూపించుకోవాలి. అలాగే వాళ్ల అకడమిక్స్ చాలా బాగుండాలి. ఈ ఎంట్రీ వీసాలను స్టేట్ డిపార్ట్​మెంట్ నిర్వహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే విదేశీ విద్యార్థులు అమెరికాలో అడుగుపెడతారో, అప్పటి నుంచి వారి కార్యకలాపాలను డిపార్ట్​మెంట్ ఆఫ్ హోమ్​ల్యాండ్​ సెక్యూరిటీ ఆధ్వర్యంలో పనిచేసే స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్​ విజిటర్ ప్రోగ్రామ్ పర్యవేక్షిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో, ఈ హోంల్యాండ్ సెక్యూరిటీ- తన డేటా బేస్​ నుంచి పలువురు విదేశీ విద్యార్థుల చట్టపరమైన నివాస స్థితిని తొలగించింది. అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల అనూహ్యంగా వీసాలు రద్దు చేయడంతో హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, మేరీల్యాండ్, ఒహియో స్టేట్ వంటి విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. వీసా రద్దుతో చదువులు కొనసాగించలేకపోతున్నామని, తమ భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: Katy Perry : అంతరిక్షాన్ని తాకిన పాప్ సింగర్ కేటీ పెర్రీ!

Related Posts
భారత్‌-చైనా మధ్య నేరుగా విమానాలు: జైశంకర్‌, చైనా మంత్రితో చర్చలు
jai shankar scaled

భారత్‌ విదేశాంగ మంత్రిగా ఎస్‌.జైశంకర్‌ రియోలో చైనా విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు. ఈ చర్చలు రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా కేంద్రీకరించాయి. Read more

Telangana : తెలంగాణలో ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు
Inter results on 22nd of this month in Telangana

Telangana : ఈ నెల 22న ఇంటర్‌ ఫలితాలు వెలువడనున్నాయి. మంగళవారం (ఏప్రిల్‌ 22) మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నట్లు Read more

సిరియాలో హింసాత్మక ఘర్షణలు..
syria clashes

సిరియాలో కొత్త అధికారులవల్ల గురువారం భద్రతా అణిచివేత చర్యలు ప్రారంభించబడ్డాయి. ఈ చర్యలు, బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వం పై ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మంది పోలీసుల మరణం Read more

తిరుమల శ్రీవారికి భారీ విరాళాలు
tirumala

తిరుమల శ్రీవారికి భారీ విరాళాలు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, తిరుపతికి చెందిన భక్తులు తమ అభిమాన దేవుడికి విరాళాలు అందజేశారు. భీమవరంకు చెందిన వెంకటరమణ భక్తుడు రూ. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×