ఏపీలోని తూర్పు తీర ప్రాంతంలో చేపల వేట నిషేధానికి గంట మోగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి 61రోజుల పాటు జూన్ 15వరకు కొనసాగనుంది. ఇందుకోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మత్స్యసంపద వృద్ధి చెందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు నెలలపాటు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నాయి. మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించి వేట చేస్తే కేసులు నమోదు చేస్తామని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు.
Advertisements
Advertisements