తెలుగు చిత్రపరిశ్రమలో తన ప్రత్యేకమైన తెలంగాణ యాస, తేలికపాటి హాస్యంతో గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) తుదిశ్వాస విడిచారు. కిడ్నీ, లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొన్ని నెలలుగా డయాలసిస్‌తో బతుకును నెట్టుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి హఠాత్తుగా క్షీణించడంతో ఇటీవల ఆయనను వెంటిలేటర్‌కు తరలించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోయాయి.
ఆర్థిక సహాయానికి విఫలమైన ప్రయత్నాలు
ఫిష్ వెంకట్‌కు కిడ్నీ మార్పిడి అత్యవసరమవుతుందని వైద్యులు సూచించగా, ఆయన కుమార్తె శ్రావంతి రూ. 50 లక్షల ఆపరేషన్ ఖర్చును భరించలేక ఆర్థిక సహాయం కోరారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలు తప్పుడు వార్తలు వెలువడ్డాయి. ప్రభాస్ సహాయం చేసారనే వార్తలు వాదనలు వినిపించగా, అవి పూర్తి అవాస్తవమని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే పవన్ కళ్యాణ్, విశ్వక్ సేన్, తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఓ మంత్రి కొంత ఆర్థిక సహాయం చేసినట్లు తెలిసింది. అయినా సరే, తగిన కిడ్నీ దాత లభించకపోవడం వల్ల ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది.
సినీ ప్రముఖుల నివాళులు, అభిమానుల కంటతడి
గబ్బర్ సింగ్, అదుర్స్, డీజే టిల్లు వంటి హిట్ చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఫిష్ వెంకట్ మృతితో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతిపై పలువురు నటులు, దర్శకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చేసే హాస్య పాత్రలు మరచిపోలేనివని, ఇకపై టెలివిజన్ స్క్రీన్ మీద ఆయనను చూడలేమన్న బాధను వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు కూడా #RIPFishVenkat అంటూ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.
Read Also : Hydraa : హైదరాబాద్లో వర్షం.. బోట్లలో ప్రజల తరలింపు