Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అగ్నిప్రమాదం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెండో బ్లాక్‌లోని బ్యాటరీలు ఉంచే ప్రదేశంలో మంటలు చెలరేగినట్లు సమాచారం.ఈ సంఘటన తెలియగానే ఎస్పీఎఫ్ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి. తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరూ కార్యాలయం లోపల లేరని సమాచారం.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఘటన పై హోంమంత్రి అనిత ఆరా తీశారు.

Advertisements

హోంమంత్రి అనిత ఆరా 

సచివాలయంలోని రెండో బ్లాక్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పినట్లు పోలీస్ ఉన్నతాధికారులు హోం మంత్రికి వెల్లడించారు. బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు వివరించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలను తేల్చాలని సంబంధిత అధికారులను హోంమంత్రి ఆదేశించారు.

fire 1743734708022 1743734708134

ఇలా వివిధ శాఖల కార్యాలయాలు ఉండటంతో నిత్యం అధికారులు, సామాన్య ప్రజలతో సచివాలయం రెండో బ్లాక్ కిటకిటలాడుతుంది. అయితే తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదంలో కొంత ఆస్తి నష్టం జరిగినా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు సచివాలయ భద్రతా సిబ్బంది విచారణ చేపట్టారు.అయితే ఈ ఘటన ప్రమాద వశాత్తు జరిగిందా లేదా కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణం పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో పోలీసుల కఠిన ఆంక్షలు విధించారు.అంతేకాకుండా, పోలీసుల మోహరింపు కూడా పెంచారు.పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మీడియాకు అనుమతులు ఇవ్వబడతాయని పోలీసులు చెబుతున్నారు.

Related Posts
Guntur: గుంటూరు నగర మేయర్ రాజీనామా!
Guntur City Mayor resigns!

Guntur: గుంటూరు నగర మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. నగరకమిషనర్‌ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో రెడ్ Read more

ఏపీలో త్వరలో లిక్కర్ ప్రీమియం స్టోర్లు
premium liquor stores

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ప్రీమియం లిక్కర్ బ్రాండ్ల విక్రయానికి ప్రత్యేకంగా ప్రీమియం స్టోర్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఈ స్టోర్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ Read more

తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలి : భూమన
Chandrababu should be responsible for the stampede.. Bhumana Karunakar Reddy

తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలని అన్నారు. పశువుల మంద Read more

Posani : పోసాని సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి
పోసానికి హైకోర్టులో దొరకని ఊరట

సీనియర్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఒక రోజు సీఐడీ కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కోర్టు నిర్ణయం తీసుకోగా, రేపు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×