fire accident in madhapur

మాదాపూర్‌లో అగ్ని ప్ర‌మాదం

హైదరాబాద్‌: హైదరాబాద్ మహానగరంలోని ఐటీ కారిడార్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఒక ఐటీ కంపెనీలో ఎగిసిపడిన మంటలు చుట్టుపక్కల వారిని షాక్ కు గురి చేశాయి. ఐటీ కారిడార్ కు గుండెకాయ లాంటి మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్వా మల్టీస్టోరెడ్ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి.

Advertisements

ఈ భారీ భవనంలో పలు ఐటీ కంపెనీలు ఉన్నాయి. ప్రత్యక్ష సాక్ష్యులు ఇస్తున్న ప్రాధమిక సమాచారం ప్రకారం సత్వా భవనంలో ఒక్కసారి మంటలు రేగటంతో భయాందోళనలకు గురైన ఉద్యోగులు పలువురు బయటకు పరుగులు తీసినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెబుతున్నారు. అయితే.. భారీ ఆస్తినష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది.

అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్నంతనే అగ్నిమాపక శాఖ ఘటనాస్థలానికి చేరుకొని.. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. దాదాపు గంటన్నరకు మంటలు అదుపులోకి వచ్చినట్లుగా చెబుతున్నారు. అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో మున్సిపల్ తదితర శాఖలు సహాయక చర్యలు చేపట్టారు. ఈ అగ్నిప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. భారీగా మంటలుచెలరేగటంతో దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ఐటీ కారిడార్ లో కీలకమైన ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదం కారణంగా పలు ఐటీ సంస్థలకు ఆపరేషన్ ఇబ్బందులు తలెత్తే వీలుందని చెబుతున్నారు. ఎందుకుంటే..సత్వా భవనంలో పెద్ద ఎత్తున సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడా భవనంలో నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలు రోజువారీ కార్యకలాపాల్ని ఎలా చేపడతారన్నది ప్రశ్నగా మారింది. ఈ అగ్నిప్రమాదం కొత్త సందేహాల్ని తెర మీదకు తీసుకొచ్చింది. భారీగా కట్టేసిన భవనాల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంటే.. వాటిని సమర్థంగా నిలువరించే వ్యవస్థ లేదన్న విమర్శ వినిపిస్తోంది.

Related Posts
Waqf Bill : వక్ఫ్‌ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Lok Sabha passes Waqf Amendment Bill

Waqf Bill: సుదీర్ఘ సంవాదాల తర్వాత వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం లోక్‌సభలో ఈ బిల్లుపై సుదీర్ఘ‌ చర్చ జరిగింది. 12 గంటల Read more

విడాకులఫై క్లారిటీ ఇచ్చిన అభిషేక్
abhi aish

ఐశ్వర్యరాయ్‌, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. నటి నిమ్రిత్‌కౌర్‌తో అభిషేక్ ఎఫైర్ కారణంగా ఐశ్వర్యతో విడిపోతున్నట్టు వార్తలొచ్చాయి. గత కొంతకాలంగా ఈ Read more

శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Srisailam corridor

హైదరాబాద్-శ్రీశైలం రహదారి మరింత అభివృద్ధి చెందనుంది. ఈ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ప్రయాణ సమయం Read more

నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం
Vaikunta Mahadwaram

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. గత పది రోజులుగా భక్తుల తాకిడితో తిరుమలలో విశేషమైన రద్దీ నెలకొంది. టీటీడీ (తిరుమల Read more