మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోండి: కొడాలి నాని

మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోండి: కొడాలి నాని

జగన్ సీఎంగా వున్న సమయంలో మీడియాలో తరచుగా నోరుపాడేసుకున్న మాజీ మంత్రి కొడాలి నేడు మళ్లీ మీడియాతో మాట్లాడారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభవనేని వంశీని పరామర్శించడా నికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చారు. ఆయన వెంట కొడాలి నాని కూడా జైలు దగ్గరకు వెళ్లారు. తనపై కేసుల అంశంపై మాట్లాడారు. తనపై మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోండి.. తమకు చాలామంది లాయర్లు ఉన్నారన్నారు. లోకేష్ రెడ్ బుక్‌ని తాను చూడలేదని.. అందులో తన పేరు ఉందో లేదో తనకు తెలియదన్నారు. ఎమ్మెల్యే ఉద్యోగం పీకేశాక తాము ఇంకేమి మాట్లాడతామమని.. ఉద్యోగం పీకేసిన తర్వాత యాక్టివ్‌గా ఉండలేం కదా అన్నారు. ఇలాంటి చిన్న చిన్న కేసుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.. ఇవన్నీ సహజం అన్నారు. రెడ్ బుక్ కాదు, బ్లూ బుక్ కాదు.. ఏ బుక్‌ను పట్టించుకునేది లేదన్నారు.

Advertisements
మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోండి: కొడాలి నాని


జగన్ తో వచ్చిన నాని
మరోవైపు విజయవాడ సబ్ జైల్‌లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించడానికి మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు అధికారులు అనుమతి నిరాకరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట జైల్లోకి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ జగన్ వెంట జైల్లోకి వెళ్లారు. వాస్తవానికి జగన్ వెంట జైల్లోకి వెళ్లేందుకు, ములాఖత్‌లో వల్లభనేని వంశీని పరామర్శించేందుకు కొడాలి నాని, పేర్ని నాని పేర్లను వైఎస్సార్‌సీపీ నేతులు ఇచ్చారు. కానీ భద్రతాపరమైన కారణాలతో పేర్ని నాని, కొడాలి నానికి జైలు అధికారులు అనమతి ఇవ్వలేమని చెప్పారు. దీంతో కొడాలి నాాని, పేర్ని నాని మాత్రం జైలు బయటే ఉండిపోయారు.
భారీగా కార్యకర్తలు
అంతకముందు బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి జైలుకు వెళ్లారు. అక్కడ ములాఖత్ ద్వారా వంశీని కలిశారు.. ఆయనను పరామర్శించారు. విజయవాడ జైలు దగ్గర వంశీ భార్య పంకజశ్రీ కూడా ఉన్నారు. వైఎస్ జగన్ రాకతో విజయవాడ జైలు దగ్గర వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

Related Posts
ఏపీ వార్షిక బడ్జెట్‌కు క్యాబినెట్‌ ఆమోదం
Cabinet approves AP Annual Budget

మొత్తం రూ.3.20 లక్షల కోట్లతో వార్షి బడ్జెట్‌‌ అమరావతి: 2025-26 వార్షిక బడ్జెట్‌ కు సంబంధించి సీఎం చంద్రబాబు అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం Read more

మహిళల అత్యవసర సమయాల్లో 181 ఫ్రీ సేవలు: మంత్రి నాదెండ్ల
మహిళల అత్యవసర సమయాల్లో 181 ఫ్రీ సేవలు: మంత్రి నాదెండ్ల

ఏలూరులో సీఆర్ఆర్ కాలేజిలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలు ఒక అద్భుతమైన సందర్భంగా మారాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు మరియు Read more

చంద్రబాబు దావోస్ పర్యటన పై వైసీపీ సెటైర్లు
cbn davos

చంద్రబాబు దావోస్ పర్యటనపై వైసీపీ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. 'చంద్రబాబు గెలిస్తే చాలు దావోస్ వెళ్లి పెట్టుబడులంటూ బిల్డప్ ఇస్తారని YCP విమర్శించింది. 'అధికారంలో ఉన్న Read more

ఏపీలో అందుబాటులోకి వచ్చిన రూ.99 ల క్వార్టర్ మందు
99 rs

ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చగా తాజాగా మందుబాబుల కోరిక కూడా తీర్చాడు. ఇటీవలే కొత్త Read more