సోంపు గింజలు ఓ సాధారణంగా కనిపించే ఆహార పదార్థమే అయినా, అందులో దాగున్న ఔషధ గుణాలు (Medicinal properties)ఎన్నో. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, శరీరాన్ని తేలికపరచడంలో కూడా సహాయపడతాయి. రోజూ కొంత మోతాదులో సోంపును ఆహారంలో భాగం చేసుకుంటే, ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. సోంపు గింజలను వాస్తవానికి రోజూ తినవచ్చు. కానీ వీటిని తినడం అంతగా ఇష్టపడకపోతే సోంపు గింజల ను నీటిలో (Fennel Seeds water ) వేసి మరిగించి డికాషన్‌లా తయారు చేసి తాగవచ్చు. లేదా రాత్రి పూట సోంపు గింజలను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను తాగవచ్చు. సోంపు గింజల నీళ్లను (Fennel Seeds water) తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. సోంపు గింజల నీళ్లను( Fennel Seeds water ) తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయ కండరాలు ప్రశాంతంగా మారుతాయి. దీంతో పొట్టలో ఉండే అసౌకర్యం తొలగిసోతుంది. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అజీర్తి తగ్గుతుంది.

ఆకలి వేయదు
సోంపు గింజల నీళ్లను సేవించడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. అసిడిటీ తగ్గుతుంది. ఐబీఎస్ అనే అనారోగ్య సమస్య ఉన్నవారు ఈ నీళ్లను తాగుతుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. సోంపు గింజల నీళ్లను తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఈ నీళ్లను తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు తగ్గుతారు. ఈ నీళ్లలో సహజసిద్ధమైన డై యురెటిక్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో అధికంగా ఉండే నీటిని బయటకు పంపిస్తాయి. దీంతో బరువు తగ్గవచ్చు. ఈ నీళ్లను తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు సైతం బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ నీళ్లను రోజూ తాగుతుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.
తీవ్రమైన వ్యాధులు తగ్గిపోతాయి
సోంపు గింజల నీళ్లను తాగడం వల్ల మూత్రం అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. ముఖ్యంగా సోడియం తగ్గించబడుతుంది. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీలపై పడే భారం తగ్గుతుంది. మూత్రాశయ సమస్యలు ఉన్నవారు ఈ నీళ్లను తాగితే మేలు జరుగుతుంది. మూత్రాశయ ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయి. మూత్రం ధారాళంగా సాఫీగా జారీ అవుతుంది. సోంపు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్, క్వర్సెటిన్, విటమిన్ సి ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో తీవ్రమైన వ్యాధులు తగ్గిపోతాయి. ముఖ్యంగా గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది.

గుండె పోటు రాకుండా
సోంపు గింజల నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియంను తగ్గించడంతోపాటు రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీబీ ఉన్నవారు ఈ నీళ్లను రోజూ తాగుతుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. సోంపు గింజల నీళ్లను తాగితే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో గుండె పోటు రాకుండా జాగ్రత్త పడవచ్చు. హార్మోన్ల సమస్యలు ఉన్నవారు రోజూ సోంపు గింజల నీళ్లను తాగుతుండాలి. ఈ గింజల్లో అధికంగా ఉండే ఫైటో ఈస్ట్రోజెన్స్ హార్మోన్ల అసమతుల్యతలను తగ్గిస్తాయి. ముఖ్యంగా మహిళలు ఈ నీళ్లను తాగితే హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి. దీంతో రుతుక్రమం సరిగ్గా వస్తుంది. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. ఇలా సోంపు గింజల నీళ్లను రోజూ తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
రోజూ సోపు గింజల నీరు తాగితే ఏమవుతుంది?
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సాన్ఫ్ నీటిని తయారు చేయడానికి ఉపయోగించే సోంపు గింజలు, మీ కడుపు జీర్ణ రసాలను మరియు ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. ఇది ఉబ్బరం, గ్యాస్ మరియు అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. సాన్ఫ్ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ కడుపు బాగా పనిచేయడానికి మరియు మీ శరీరం ఆహారం నుండి పోషకాలను గ్రహించడాన్ని సులభతరం చేస్తుంది.
సోపు నీరు త్రాగడానికి ఉత్తమ సమయం?
ఉదయం మొదటగా సోంపు నీటిని తాగడం వల్ల మీ జీవక్రియ పెరుగుతుంది. ఇది మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది మరియు కేలరీలను మరింత సమర్థవంతంగా బర్న్ చేస్తుంది.
సోపు గింజల నీరు కిడ్నీలకు మంచిదా?
సోంపు గింజలు అనెథోల్ మరియు ఫ్లేవనాయిడ్లు వంటి సమ్మేళనాలతో సమృద్ధిగా ఉంటాయి, ఇవి వాపును తగ్గించడంలో మరియు ఆక్సీకరణ ఒత్తిడి నుండి మూత్రపిండాలను రక్షించడంలో సహాయపడతాయి . అంతర్గత వాపును శాంతపరచడం ద్వారా, సోంపు గింజలు మొత్తం మూత్రపిండాల పనితీరు మరియు దీర్ఘాయువుకు మద్దతు ఇస్తాయి.
Read hindi news: hindi.vaartha.com