ఇటలీలోని (In Italy) మిలాన్ మాల్పెన్సా ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికురాలు చేసిన రచ్చ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. లగేజీ బరువు ఎక్కువగా ఉందని విమానంలోకి (On the plane) అనుమతించకపోవడంతో, ఆమె కిందపడి డొల్లుతూ నానా హంగామా చేసింది.విమానయాన నియమాల ప్రకారం, హ్యాండ్ లగేజీకి పరిమితి ఉంటుంది. అయితే ఆ మహిళ తీసుకొచ్చిన బ్యాగ్ ఆ పరిమితిని దాటి ఉంది. అందుకే అధికారులు అదనపు చార్జీలు పెట్టారు. లేకపోతే చెకిన్ లగేజీలో పెట్టాలని సూచించారు.కానీ ఆమె క్షణంలోనే అదుపు తప్పింది. నేలపై పడిపోయి, చేతులు కాళ్లు ఊపుతూ గోల చేసింది. ఈ దృశ్యాలను చూసిన ప్రయాణికులు అవాక్కయ్యారు. నేరుగా అధికారులపై నోరు పారేసుకుంది. ఎంత చెప్పినా వినిపించుకోలేదు.
అధికారుల నిర్ణయంతో విమానానికి నో ఎంట్రీ
ఈ వ్యవహారంతో ఆమెను ఆ ఫ్లైట్‌కి అనుమతించలేదు. ఆమె తరువాతకు ఓ కొత్త టిక్కెట్ బుక్ చేసి, ఇంకో విమానంలో పంపారు. అంతకుముందు ఆమె చేసిన హంగామా వీడియో మాత్రం అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ వీడియోపై నెటిజన్లు స్పందన వెల్లువెత్తించారు. “ఇలా పడ్డంత మాత్రాన అధికారులు అనుమతిస్తారా?” అంటూ కొందరు వ్యంగ్యంగా ప్రశ్నించారు. మరికొందరు “ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యపు ప్రవర్తన” అని మండిపడ్డారు.
ఇలాంటివి పెరిగిపోతున్నాయి
ఇటీవల కాలంలో ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు ఇలా రాద్ధాంతం చేయడం తరచుగా జరుగుతోంది. గత నెలలో చికాగో ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు కంప్యూటర్ మానిటర్‌ను సిబ్బందిపై విసిరాడు. ఈ ఘటనలతో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఎయిర్‌లైన్స్ కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రయాణికులకు ముందుగానే నిబంధనలు వివరించడం, సిబ్బందికి పూర్తి మద్దతు కల్పించడం ప్రారంభించారు. ఎయిర్‌పోర్టులో శాంతిని కాపాడేందుకు ఈ మార్గాలు కీలకం కానున్నాయి.
Read Also : Ahmedabad Plane Crash : అదృష్టవశాత్తు తప్పించుకున్న మహిళ!