ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.వైసీపీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కి టెన్షన్ మొదలయ్యింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తును వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి కీలక వ్యక్తుల పేర్లు ప్రస్తావించి వారికి ఉచ్చు బిగించారు.ఇటీవల చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆ పార్టీ నేతలకు మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. ముఖ్యంగా, లిక్కర్ స్కాం, కాకినాడ పోర్టు వ్యవహారాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీని టెన్షన్ లో కి పడేశాయి.
ముఖ్య నేతలతో సమావేశం
కూటమికి ఈ పరిణామాలు వరంగా మారుతున్నాయి. దీంతో, జగన్ అలర్ట్ అయ్యారు. ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. రానున్న రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.సాయిరెడ్డి వ్యాఖ్యలతో వైసీపీ మాజీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీ ముఖ్య నేతలకు టెన్షన్ గా మారారు.
లిక్కర్ స్కాం
పోర్టు వ్యవహారంలో అంతా సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి కర్మ, కర్త, క్రియగా పేర్కొన్నారు. పరోక్షంగా విక్రాంత్ రెడ్డి మొత్తం వ్యవహారం నడిపారనే అభియోగాల వేళ సాయిరెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదే సమయంలో లిక్కర్ స్కాంలోనూ ఆసక్తి కర అంశాలను ప్రస్తావించారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లిక్కర్ స్కాంలో సూత్రధారి.
సీఐడీ విచారణ
తాజాగా కాకినాడ పోర్టు గురించి సీఐడీ విచారణకు హాజరైన సాయిరెడ్డి రెండు ప్రధాన అంశాల పైన కీలక వ్యాఖ్యలు చేశారు.
కొత్త ట్విస్ట్
పాత్రధారిగా పేర్కొన్న సాయిరెడ్డి.. భవిష్యత్ లో అవసరమైతే మరిన్ని అంశాలను వెల్లడిస్తానంటూ పార్టీ నేతల కు కొత్త ట్విస్ట్ ఇచ్చారు.విచారణల పర్వం ఇటు లిక్కర్ స్కాం లో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. అనేక కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.అసలు టెండర్ల ఖరారు నుంచి అమ్మకాల వరకు చోటు చేసుకున్న పరిణామాల పైన సీఐడీ ఆరా తీస్తోంది.ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా టీడీపీ తమ సోషల్ మీడియా ఖాతాలో సంచలన ఆరోపణలు చేసింది. మిథున్ రెడ్డి సైతం తమ పైన రాజకీయ కోణంలోనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇటు లిక్కర్ స్కాంలో వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగుస్తోందనే చర్చ కూటమి ముఖ్య నేతల్లో జరుగుతోంది.

సాయిరెడ్డి వ్యాఖ్యలు
త్వరలోనే నోటీసులు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. సాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలను విచారణలో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.జగన్ వాట్ నెక్స్ట్ ఇక, సాయిరెడ్డి తాజాగా పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి మరో ట్వీట్ చేసారు. కోటలో రాజు ప్రజల్లోకి రావాలని సూచించారు. కోటరీ మాటలు వింటే కోట కూలిపోతుందని.రాజ్యం పోతుందని సాయి రెడ్డి చెప్పుకొచ్చారు.
సాయిరెడ్డి సూచనలు
సీఎంగా ఉన్న సమయంలో జగన్ ప్రజలను కలవని అంశాన్ని.. ఇప్పటికైనా ఇక ప్రజల్లోకి రావాలనే విషయాన్ని జగన్ కు సూచించారు. ఇటు జగన్ పార్టీ నియామకాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. సాయిరెడ్డి వ్యాఖ్యల పైన పార్టీ నేతలు స్పందిస్తున్నారు. జగన్ తాజాగా సాయిరెడ్డి వ్యాఖ్యల గురించి ముఖ్య నేతలు ప్రస్తావన చేసినా స్పందించలేదని తెలుస్తోంది. ఇక వచ్చే నెల నుంచే జిల్లా పర్యటనలు చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.