టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది.ప్రపంచంలోనే అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ మరో 2-3 ఏళ్లు ఆడుతాడని అంతా అనుకున్నారు. కానీ అతను సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేశాడు. బీసీసీఐ తీరు వల్లే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లీ రిటైర్మెంట్‌పై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అసలు కారణం ఏంటో ఎవరికి తెలియదు.విరాట్ కోహ్లీకి అత్యంత సన్నిహితంగా ఉండే టీమిండియా మాజీ క్రికెటర్ రవి శాస్త్రి(Ravi Shastri) కూడా అతని రిటైర్మెంట్ షాక్‌కు గురిచేసిందని చెప్పాడు. మరో రెండు మూడేళ్లు ఆడాల్సిన సత్తా కోహ్లీకి ఉన్నా మానసికంగా బాగా అలసిపోవడంతో ఆటకు వీడ్కోలు పలికాడని చెప్పాడు. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటనకు ముందు అతనితో మాట్లాడినట్లు కూడా రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

ఇన్నింగ్స్
కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడానికి వారం రోజుల ముందు అతనితో మాట్లాడాడు. ఆటలో రాణించాల్సినంత రాణించాననే స్పష్టతతో కోహ్లీ ఉన్నాడు. రిటైర్మెంట్ ప్రకటించినందుకు కోహ్లీలో ఎలాంటి బాధ లేదు. చాలా సంతోషంగా ఆటకు వీడ్కోలు పలికాడు. అతని నిర్ణయం నన్ను షాక్‌కు గురి చేసింది. అతనిలో మరో రెండు, మూడేళ్లు ఆడే సత్తా ఉంది. శారీరకంగా కూడా ఫిట్‌గా ఉన్నాడు. కానీ మానసికంగా బాగా అలసిపోయాడు.సాధారణంగా ఓ ఆటగాడు తన బాధ్యతను పూరి చేసి ప్రశాంతంగా ఉంటాడు. కోహ్లీ మాత్రం జట్టు బరిలోకి దిగినప్పుడు అన్ని వికెట్లు తానే తీయాలి, అన్ని క్యాచ్‌లు తానే పట్టాలి, అన్ని నిర్ణయాలు తానే తీసుకోవాలి అన్నట్లు వ్యవహరిస్తాడు. ఆట తీవ్రత ఆ స్థాయిలో ఉంటే మానసికంగా అలసిపోక తప్పదు.’అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.విరాట్ కోహ్లీ(Virat Kohli) తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో 123 టెస్ట్‌లు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి.సుదీర్ఘ ఫార్మాట్‌లో కోహ్లీ సక్సెస్‌ఫుల్ టీమిండియా కెప్టెన్. అతని సారథ్యంలో 68 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 40 మ్యాచ్‌లు గెలిచింది. 2016-19 మధ్య కాలంలో కోహ్లీ పరుగుల మోత మోగించాడు. ఈ మూడేళ్లలో అతను 43 టెస్ట్‌ల్లో 66.79 సగటుతో 4,208 రన్స్ చేశాడు. ఆడిన 69 ఇన్నింగ్స్‌లో 16 శతకాలతో పాటు 10 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ కాలంలోనే కోహ్లీ వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగాడు.
Read Also: Telangana: ప్రాణహిత-గోదావరి లోయలో డైనోసార్ అవశేషాలు