ttd employees

18 మంది అన్యమత ఉద్యోగులపై వేటు

టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు మొదలయ్యాయి.. టీటీడీ పాలకమండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో.. టీటీడీ ఉద్యోగులుగా ఉంటూ హిందూ మతేతర సంప్రదాయాలను అనుసరిస్తున్న 18 మంది ఉద్యోగులను అధికారులు గుర్తించారు. ఎండోమెంట్ యాక్ట్ 1060, 1989 ప్రకారం.. నవంబర్ 18, 2024 టీటీడీ బోర్డు తీర్మానం ప్రకారం.. హిందూమత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొంది.. నేడు అన్యమతాన్ని అభ్యసిస్తూ.. భక్తుల మనోభావాలను, టీటీడీ పవిత్రతను కొందరు ఉద్యోగులు దెబ్బతీస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు వారిపై చర్యలు కూడా మొదలయ్యాయి.

Advertisements
Padmavathi Travels chennai to tirupati packages

తాజాగా తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న 18 మంది ఉద్యోగులపై చర్యలు ప్రారంభించారు. హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూ.. టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు తాజాగా కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ 18 మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల, టీటీడీ అనుబంధ ఆలయాల్లో, ఆలయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తుంటే వెంటనే వారిని బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ 18మందిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్లు, తదితరులు ఉన్నారు. ఇకపై సదరు ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని ఆదేశించారు. అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ, లేని పక్షంలో వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలని ఇటీవల టీటీడీ బోర్డు తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ 18మంది అన్యమత ఉద్యోగులపై చర్యలు మొదలు పెట్టింది టీటీడీ.

Related Posts
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ రోజు ప్రారంభమైన ఈ ఉత్సవాలు, 11వ తేదీ వరకు కొనసాగనున్నాయి.ఈ ఉత్సవాలు ఆలయ గోపురంపై Read more

మకర సంక్రాంతి ? జనవరి 14 లేదా 15నా? పూజా శుభ సమయం ఎప్పుడంటే?
makara sankranti

మకర సంక్రాంతి పండగ ప్రాముఖ్యత మరియు 2025 సమయం వివరాలు మకర సంక్రాంతి భారతీయుల హృదయానికి ఎంతో ప్రత్యేకమైన పండగ. ఇది పంటల పండుగగా మాత్రమే కాకుండా, Read more

Tirumala: తిరుమల కొండపై ఎడతెరిపి లేకుండా వాన
tirumala rains

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ వేకువజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ తెల్లవారుజాము 4 గంటల Read more

తిరుమల బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి
tirumala brahmotsavam 2024

తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం ముందు అపశ్రుతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగింది. సాయంత్రం నిర్వహించే ధ్వజారోహణలో ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఈ కొక్కి ద్వారానే Read more

×