Varun Sandesh: టాలీవుడ్‌లో కొన్ని ఆన్-స్క్రీన్ జంటలు తెరపై క్రియేట్ చేసే మ్యాజిక్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి సంచలన కాంబినేషన్లలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ఒకరు. దాదాపు 18 ఏళ్ల క్రితం ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో తెలుగు యువతను ఉర్రూతలూగించిన ఈ సూపర్ హిట్ జోడీ, ఇప్పుడు మరోసారి వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతోందన్న వార్త టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also : Upcoming Movies: త్వరలో ప్రేక్షకుల ముందు రాబోతున్న సినిమాలు ఇవే

Varun Sandesh: యూత్‌ను మెస్మరైజ్ చేసిన ‘బాలు – స్వప్న’
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణలో 2008లో వచ్చిన ‘కొత్త బంగారు లోకం’ చిత్రం ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో బాలుగా వరుణ్ సందేశ్ అమాయకత్వం, స్వప్నగా శ్వేతా బసు ప్రసాద్ చిలిపితనం, ఆమె చెప్పిన ఎక్కడా….అనే ఐకానిక్ డైలాగ్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. కాలేజ్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న వీరి ఆన్-స్క్రీన్ కేమిస్ట్రీకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందని ఆశించిన సినీ ప్రియులకు సుదీర్ఘ కాలం పాటు నిరీక్షణే మిగిలింది.
9 ఏళ్ల తర్వాత శ్వేతా బసు ప్రసాద్ టాలీవుడ్ రీఎంట్రీ
ఈ వార్తకు మరింత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం శ్వేతా బసు ప్రసాద్ టాలీవుడ్ రీఎంట్రీ. తెలుగులో చివరగా 2017లో ‘మిక్చర్ పొట్లం’ అనే చిత్రంలో కనిపించిన శ్వేత, ఆ తర్వాత ఎక్కువగా బాలీవుడ్ వైపు దృష్టి సారించారు. అక్కడ పలు విజయవంతమైన సినిమాలు, విమర్శకుల ప్రశంసలు పొందిన వెబ్ సిరీస్‌లలో నటించి తన నటనతో మెప్పించారు. 2022లో వచ్చిన ‘ఇండియా లాక్‌డౌన్’ తర్వాత కాస్త విరామం తీసుకున్న ఆమె, ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం నేరుగా తెలుగు చిత్రసీమలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. మరోవైపు హీరో వరుణ్ సందేశ్ కూడా కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో అలరిస్తున్నారు. ఇలాంటి సమయంలో వీరిద్దరూ మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారనే వార్త సినీ ప్రేమికుల పాత జ్ఞాపకాలను ఒక్కసారిగా తట్టిలేపింది.
‘కొత్త బంగారు లోకం’ సీక్వెలా?
ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్‌ను ఎవరు తెరకెక్కిస్తున్నారు, దర్శకుడు, నిర్మాత ఎవరు అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక ప్రకటన వెలువడక ముందే ఈ జోడీ రీయూనియన్ వార్త నెట్టింట వైరల్ అవ్వడంతో సినీ వర్గాల్లో భారీ హైప్ నెలకొంది. 18 ఏళ్ల క్రితం స్వచ్ఛమైన ప్రేమకథతో యువత మనసులను కొల్లగొట్టిన ఈ జంట, ఇన్నేళ్ల తర్వాత ఎలాంటి కథతో రాబోతున్నారు? ‘కొత్త బంగారు లోకం’ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నారా? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్‌లో వెల్లువెత్తుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :