Tollywood November releases: సాధారణంగా టాలీవుడ్‌లో సంక్రాంతి, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగ సీజన్లలోనే భారీ బడ్జెట్ సినిమాలు, క్రేజీ ప్రాజెక్ట్‌లు విడుదలవుతుంటాయి. కానీ ఈ ఏడాది నవంబర్ నెల మాత్రం దానికి మించిన అసలైన సినీ పండుగను తలపిస్తోంది. వారం వారం విభిన్న కథాంశాలు, అగ్ర నటీనటుల క్రేజీ చిత్రాలతో బాక్సాఫీస్ కళకళలాడటానికి సిద్ధమైంది. చిన్న, మధ్య తరహా చిత్రాలతో పాటు పాన్ ఇండియా స్థాయి సినిమాలు సైతం బరిలో దిగుతుండటంతో థియేటర్ల వద్ద సందడి తారాస్థాయికి చేరనుంది.
Read Also : Scene Movie Pre Release Event: నజ్రియా నాతో సినిమాకు మూడుసార్లు రిజెక్ట్ చేసింది.. సూర్య

Tollywood November releases: మొదటి వారంలో ‘రామాయణం’ హంగామా
నవంబర్ నెల ఆరంభంలోనే బాక్సాఫీస్ వద్ద భారీ హంగామా మొదలుకానుంది. దీపావళి కానుకగా వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణం: పార్ట్ 1’ నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ విజువల్ వండర్ పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
రెండవ వారంలో పది సినిమాలు థియేటర్లలోకి రావడానికి క్యూ కడుతున్నాయి. నవంబర్ 12, 13 తేదీలలో శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ ‘భోగి’ సినిమా రిలీజ్ కానుంది. అలాగే సుడిగాలి సుధీర్ నటించిన ‘గోట్’ (GOAT) మూవీ సైతం ఇదే వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కిన ‘ఇట్లు అర్జున’, విభిన్న కథాంశాలతో వస్తున్న చంద్రయాన్, మాయలేడి వంటి చిత్రాలు కూడా నవంబర్ రెండో వారంలోనే సందడి చేయనున్నాయి.
నవంబర్ మూడో వారంలో యూత్‌లో కల్ట్ ఫాలోయింగ్ ఉన్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా తరుణ్ భాస్కర్ – విశ్వక్‌సేన్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ నవంబర్ 19న విడుదలవుతుండటంతో యువతలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. వీటితో పాటు దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’, ధనుష్ – సాయి పల్లవి కాంబోలో వస్తున్న ‘ఓం’, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సత్యవాన్ సావిత్రి’ చిత్రాలు కూడా ఇదే వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
నెలఖారులో లేడీ ఓరియెంటెడ్ & మాస్ ధమాకా!
నెలఖారులోనూ లేడీ ఓరియెంటెడ్, మాస్ యాక్షన్ సినిమాల జోరు విపరీతంగా కొనసాగనుంది. నవంబర్ 27న గిరిజన యువతి శక్తివంతమైన పాత్రలో రష్మిక మందన్న కనిపిస్తున్న ‘మైసా’ (Maisa) మూవీతో పాటు, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా వస్తున్న హైవోల్టేజ్ మాస్ యాక్షన్ చిత్రం ‘హైందవ’ థియేటర్లలో పోటీ పడనున్నాయి. ఇలా రకరకాల జానర్‌లలో వస్తున్న భారీ చిత్రాలతో ఈ నవంబర్ మాసం టాలీవుడ్‌కు ఒక రేంజ్ బాక్సాఫీస్ బోనంజాగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :