Asha Bhosle: గాయని ఆశా భోస్లేకు గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు!

Follow Us: Google News Daily Hunt
Asha Bhosle
Asha Bhosle
FONT SIZE
GET APP

Asha Bhosle: భారతీయ సంగీత శిఖరం, లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఆశా భోస్లే (92) అనారోగ్యానికి గురయ్యారు. శనివారం ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు.ఈ విషయాన్ని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి డాక్టర్ ప్రతీత్ సందానీ ఒక ప్రకటనలో ధ్రువీకరించారు.

Read Also: Singer Mangli: నార్సింగి పోలీస్ స్టేషన్‌లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు

భారత సినీ సంగీత ప్రపంచంలో ఆశా భోంస్లే ఒక శిఖరం లాంటివారు. 1943లో మరాఠీ చిత్రం ‘మాఝా బల్’తో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె, 1948లో హిందీ చిత్రం ‘చునరియా’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో హిందీతో పాటు 20కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో దాదాపు 12,000కు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు. ఆర్.డి. బర్మన్, ఇళయరాజా, ఏ.ఆర్. రెహమాన్ వంటి ఎందరో ప్రముఖ సంగీత దర్శకులతో ఆమె పనిచేశారు.

Asha Bhosle Heart Attack News
Asha Bhosle Heart Attack News

Asha Bhosle: నటిగా కూడా

ఆమె సంగీత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000లో అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. వీటితో పాటు ఆమె అనేక ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు. గాయనిగానే కాకుండా 2013లో ‘మాయ్’ అనే మరాఠీ చిత్రంలో నటిగా కూడా కనిపించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు