Encounter in Chhattisgarh.. Two Maoists killed

Maoist : ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు .. ఇద్దరు మావోలు మృతి

Maoist : మరోసారి ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో కాల్పుల మోత మోగింది. బస్తర్‌ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మృతిచెందారు. వీరి తలలపై రూ.13లక్షల రికార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కొండగావ్‌-నారాయణ్‌పుర్‌ సరిహద్దులోని అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో వారు పరారయ్యారు.

Advertisements
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు  ఇద్దరు

ఇప్పటివరకు 140 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతి

ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో రెండు మృతదేహాలు, ఏకే-47 తుపాకీని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతులను మావోయిస్టు అగ్ర నేత, కమాండర్‌ హల్దార్‌, ఏరియా కమిటీ సభ్యుడు రామి అని గుర్తించారు. హల్దార్‌పై రూ.8లక్షలు, రామిపై రూ.5లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోందని బస్తర్‌ రేంజ్‌ ఐజీ పి.సుందర్‌రాజ్‌ వెల్లడించారు. తాజా ఎన్‌కౌంటర్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు 140 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతిచెందారు. వీరిలో ఒక్క బస్తర్‌ డివిజన్‌లోనే 123 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.

Read Also: అమర్​నాథ్ యాత్ర ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

Related Posts
తెలంగాణ లాసెట్, పీజీ ఎల్ సెట్ షెడ్యూల్ విడుదల
Telangana Lawset, PG L Set schedule released

హైదరాబాద్‌: లా కోర్సుల్లో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన చేసింది. లాసెట్, పీజీ ఎల్సెట్ నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ను శనివారం Read more

Narendra Modi: మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ
Narendra Modi: మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని మళ్లీ ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు కీలకంగా మారబోతుంది. మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అమరావతిలో అడుగుపెట్టి, Read more

రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబు.
రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబు.

రెండవ ప్రపంచ యుద్ధం మచ్చలు ఇప్పటికీ కనపడుతూనే ఉన్నాయి. 2024లో అస్సాంలోని లఖింపూర్ జిల్లాలో రెండవ ప్రపంచ యుద్ధం నాటి 182 కిలోల బాంబును నిర్వీర్యం చేశారు. Read more

15న పార్లమెంటులో ‘రామాయణం’ ప్రదర్శన
'Ramayana' performance

ఈ నెల 15న పార్లమెంటులో భారతదేశపు ప్రఖ్యాత మహాకావ్యమైన 'రామాయణం'ను ఆధారంగా తీసుకుని రూపొందించిన యానిమేటెడ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. 'రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×