ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా (Bijapur district) అడవుల్లో భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్ మరెన్నో ప్రాణాలు బలిగొంది. సమాచారం అందిన వెంటనే బలగాలు ఆ ప్రాంతంలో సచివాలయ తనిఖీలు చేపట్టగా, అకస్మాత్తుగా నక్సల్స్ కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుదాడి చేయగా, తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి.
20 మంది నక్సల్స్ మృతి
ఈ ఎన్‌కౌంటర్లో ఇప్పటివరకు 20 మంది నక్సల్స్ మృతి (20 Naxalites killed) చెందినట్లు సమాచారం. మృతులలో కొంతమంది టాప్ మావోయిస్టులు ఉన్న అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరికొంతమంది అడవుల్లోకి పారిపోయినట్లు తెలుస్తుండగా, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని భద్రతా వర్గాలు వెల్లడించాయి. గాయపడిన జవానులను హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలించారు.
సమీప గ్రామాల్లో భయాందోళనలు
ఈ ఘటనతో సమీప గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టి మరిన్ని ఆపరేషన్లకు సిద్ధమవుతున్నాయి. నక్సల్స్ చొరబాటును నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ ఎదురుకాల్పులు భద్రతా వర్గాలకు పెద్ద విజయంగా భావిస్తున్నారు.
Read Also : Congress : నిధులు లేకపోయినా పథకాల అమలు – మంత్రి పొంగులేటి