'ఎక్స్'ను అమ్మేసిన‌ ఎలాన్ మ‌స్క్

Elon Musk: ‘ఎక్స్’ను అమ్మేసిన‌ ఎలాన్ మ‌స్క్

టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ, ప్ర‌పంచ‌కుబేరుడు ఎలాన్ మ‌స్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌)ను విక్రయించినట్టు మస్క్ ప్రకటించారు. అయితే, బయట వ్యక్తులకు మాత్రం కాదు. మస్క్ ఏఐ స్టార్టప్ కంపెనీ ‘ఎక్స్ ఏఐ’కు విక్రయించారు. ఈ మేరకు ఎక్స్‌లో మస్క్ పోస్ట్ చేశారు.
‘ఎక్స్ ఏఐ’ విలువను 80 బిలియన్ డాలర్లు
మొత్తం 33 బిలియన్ డాలర్ల (రూ. 2.80 లక్షల కోట్లు)కు ఎక్స్‌ను అమ్మినట్లు తెలిపారు. దీంతో ప్రస్తుతం ‘ఎక్స్ ఏఐ’ విలువను 80 బిలియన్ డాలర్లుగా మస్క్ పేర్కొన్నారు. అధునాత ఏఐ టెక్నాలజీని ‘ఎక్స్‌’కు అనుసంధానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని మస్క్ తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ‘ఎక్స్‌’కు 600 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు.

'ఎక్స్'ను అమ్మేసిన‌ ఎలాన్ మ‌స్క్

టెస్లా, స్పేస్‌ఎక్స్‌లకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా..
కాగా, టెస్లా, స్పేస్‌ఎక్స్‌లకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సలహాదారుగా పనిచేస్తున్న మస్క్ 2022లో ‘ట్విట్టర్’ అనే సోషల్ మీడియా సైట్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం దాని పేరును ‘ఎక్స్’గా మార్చారు. ‘ఎక్స్’ను కొనుగోలు చేసిన త‌ర్వాత‌ సిబ్బందిని తొలగింపు, ద్వేషపూరిత ప్రసంగాలు, వినియోగదారు ధృవీకరణ త‌దిత‌ర అంశాలు అప్ప‌ట్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇక ‘ఎక్స్ ఏఐ’ను రెండేళ్ల కిందటే మస్క్ ప్రారంభించారు. “ఈరోజు మేము అధికారికంగా డేటా, మోడల్స్, కంప్యూట్, డిస్ట్రిబ్యూషన్, ప్రతిభను అనుసంధానం చేయడానికి ముందడుగు వేస్తున్నాం. ఇది ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాకుండా మానవ పురోగతిని మరింత వేగవంతం చేసే సమర్ధవంతమైన వేదికను నిర్మించడానికి మాకు వీలు కల్పిస్తుంది” అని మస్క్ త‌న పోస్టులో పేర్కొన్నారు.

Related Posts
ట్రంప్‌ హామీతో టిక్‌టాక్‌ సేవల పునరుద్ధరణ
tiktok

అగ్రరాజ్యం అమెరికాలో ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ మూగబోయిన విషయం తెలిసిందే. జనబాహుల్యంలో విశేష ఆదరణ పొందిన ఈ షార్ట్‌ వీడియో యాప్‌ను నిషేధించేందుకు తీసుకొచ్చిన Read more

IPL 2025 : ఐపీల్ మ్యాచ్ టికెట్స్ కావాలా.. ఇలా బుక్ చేస్కోండి!
ఐపీల్ మ్యాచ్ టికెట్స్ కావాలా.. ఇలా బుక్ చేస్కోండి!

ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. మిలియన్ డాలర్ల టోర్నమెంట్ ప్రారంభం కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఐపీఎల్ 18 సీజన్ నేటి నుంచే Read more

పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Supreme Court verdict on PG

పీజీ మెడికల్ సీట్ల కేటాయింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర కోటా ఆధారంగా సీట్ల కేటాయింపు ఇకపై చెల్లదని స్పష్టం చేసింది. రాష్ట్రాల కోటాలో 50 Read more

IPL2025 :రిషబ్ పంత్‌కు సంజీవ్ గోయెంకా హెచ్చరిక.. ఎందుకంటే!
IPL2025 :రిషబ్ పంత్‌కు సంజీవ్ గోయెంకా హెచ్చరిక.. ఎందుకంటే!

ఐపీఎల్ 2025 సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్ జి) ఒక వికెట్ తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *