Technology: సవాళ్లను అధిగమిస్తేనే సాంకేతికంగా ముందడుగు

Follow Us: Google News Daily Hunt
Technology
Technology
FONT SIZE
GET APP

Technology : రక్షణ, టెలికాం, ఆటోమొబైల్స్, ఏఐ, ఆరోగ్య సం రక్షణ… ఇలా నేడు అన్నింటికీ సెమీకండక్టర్లు ప్రాణా వసరాలుగా మారాయి. ఆధునిక సాంకేతిక జగత్తుకు మెద డుగా, 21వ శతాబ్దపు చమురుగా అవి గుర్తింపు పొందా యి. వాటి తయారీపై ఆలస్యంగా దృష్టిసారించిన ఫలి తంగా ప్రస్తుతం దేశానికి కావాల్సిన చిప్లలో 90శాతానికి పైగా దిగుమతులే దిక్కవుతున్నాయి. కొవిడ్ సమయంలో సరఫరాలు స్తంభించి పరిశ్రమలు కుదేలయ్యాయి. ఈ దురవస్థను తప్పించేందుకు చిప్లను స్థానికంగానే డిజైన్ చేసుకోవడంతోపాటు తయారీ, ప్యాకేజింగ్, టెస్టింగ్ తది తరాల్లో స్వావలంబన సాధించేందుకు ఇండియా నడుం కట్టింది. అందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఆదిలోనే సంక్లిష్ట చిప్ల జోలికి వెళ్లకుండా దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా వ్యూ హాత్మకంగా ముందుకు సాగాలని నీతి అయోగ్ రోద్మ్యాప్ ఇటీవల సూచించింది. ఈ క్రమం లోనే గుజరాత్లోని సానండ్లో జపాన్, థాయ్లాండ్ సంస్థల సహకారంతో సిద్ధమైన కర్మాగారం. ఇది గడిచిన నాలుగు నెలల వ్యవధిలో పట్టాలకెక్కిన మూడో సెమీకండక్టర్ పరిశ్రమ కావడం విశేషం. ఏడాదికి 20కోట్ల చిప్లతో మొద లుపెట్టి, రాబోయే రోజుల్లో కొత్త ప్లాంటు తయారీ సామ ర్ధ్యాన్ని 500 కోట్లకు తీసుకెళ్లాలన్నది లక్ష్యం. అన్నీ అను కున్నట్లుగా జరిగితే ఇక్కడి నుంచి విదేశాలకూ ఎగుమతులు సుసాధ్యమై ‘మేకిన్ ఇండియా’ ప్రస్థానం మరో మెట్టుకు చేరుతుంది!

Read Also : UPI చెల్లింపుల్లో కీలక మార్పులు!

Technology
Technology

Technology: సెమీకండక్టర్ల అవసరం

దేశీయంగా సెమీకండక్టర్ల వినియోగం ప్రస్తుతంతో పోలిస్తే, 2030 నాటికి రెట్టింపవుతుందని అంచనా. పీఎస్ఐ వంటి పథకాల కారణంగా మొబైళ్లతయా రీలో ఇండియా ప్రపంచంలోనే రెండోస్థానానికి చేరింది. ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి సైతం కొన్నేళ్లుగా జోరందుకుంది. దాంతో సెమీకండక్టర్ల అవసరం అధికమైంది. వాటి కోసం చైనా, తైవాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. గడిచిన తొమ్మిదేళ్ల లో సెమీకండక్టర్ ఉత్పత్తులకు భారతావని 15వేల కోట్ల డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని ధారపోసింది. ఈ పరాధీ నత లోంచి బయటపడేందుకు ఇప్పటిదాకా రూ.1.64 లక్షల కోట్ల విలువైన 12 సెమీకండక్టర్ తయారీ ప్రాజె క్టులకు ఇండియా ఆమోదం తెలిపింది. డిజైన్ అనుసం ధానిత ప్రోత్సాహక పథకం కింద 24 చిప్ రూపకల్పన పాజెక్టులకూ ఊతమిస్తోంది.

Technology
Technology

నిపుణులకు కొరత

జపాన్, నెదర్లాండ్స్ వంటి దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలతో ముడిసరకులు, యంత్రాల సరఫరాలకు ఇబ్బందులు లేకుండా చూసుకుం టోంది. అందులో భాగంగానే అమెరికా నేతృత్వంలోని లిప్యాక్స్ సిలికాఖిలోనూ భాగమైంది. ఇలా ఈ రంగంలో ఆత్మనిర్భరత కోసం ప్రణాళికాబద్ధంగా కృషి జరుగుతున్న ప్పటికీ, ఇండియా అధిగమించాల్సిన సవా ళ్లూ కొన్ని ఉన్నా యి! మైక్రో చిప్ల తయారీకి నిరంతరం విద్యుత్, నీటి లభ్యత తప్పనిసరి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగు ణంగా దేశీయంగా మౌలిక వసతులు పాదుకొనాల్సి ఉంది. ప్రపంచవ్యాప్త చిప్ డిజైనర్లలో 20శాతం భారతీయులే అయినప్పటికీ వాటి తయారీలో పనిచేయగలిగిన సాంకేతిక నిపుణుల లేమి వేధిస్తోంది. సెమీకండక్టర్లకు అత్యవసరమై న ముడిసరకుల కోనమూ విదేశాల వైపు చూడాల్సి వస్తోం ది. ఈ కీలక రంగాన్ని ఏలుతున్న దేశాలతో పోలిస్తే మన దగ్గర పరిశ్రమలకు ప్రోత్సాహకాలు తక్కువగా ఉంటున్నా యి. కండక్టర్ల సరఫరా గొలుసులో ప్రపంచానికి విశ్వస నీయ గమ్యస్థానంగా ఎదగాలన్న భారత్ కల నెరవేరాలం టే వీలైనంత వేగంగా సంబంధిత ఆవరణ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. 2032 నాటికి విశ్వవ్యాప్తంగా 10 లక్షల మంది సెమీకండక్టర్ నిపుణులకు కొరత ఏర్పడుతుందన్న విశ్లేషణలను గమనంలో ఉంచుకుంటూ ఆ మానవ వన రులా సృష్టిపైనా సమధికంగా దృష్టిసారించాలి!


-వి. వీరప్ప

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు