Technology : సవాళ్లను అధిగమిస్తేనే సాంకేతికంగా ముందడుగు

Follow Us: Google News Daily Hunt
Technology
Technology
FONT SIZE
GET APP

Technology : రక్షణ, టెలికాం, ఆటోమొబైల్స్, ఏఐ, ఆరోగ్య సంరక్షణ… ఇలా నేడు అన్నింటికీ సెమీకండక్టర్లు ప్రాణావసరాలుగా మారాయి. ఆధునిక సాంకేతిక జగత్తుకు మెదడుగా, 21వ శతాబ్దపు చమురుగా అవి గుర్తింపుపొందాయి. వాటి తయా రీపై ఆలస్యంగా దృష్టిసారించిన ఫలితంగా ప్రస్తుతం దేశా నికి కావాల్సిన చిప్లలో 90శాతానికి పైగా దిగుమతులే దిక వుతున్నాయి. కొవిడ్ సమయంలో సరఫరాలు స్తంభిం చి పరిశ్రమలు కుదేలయ్యాయి. ఈ దురవస్థను తప్పించేం దుకు చిప్లను స్థానికంగానే డిజైన్ చేసుకోవడంతోపాటు తయారీ, ప్యాకేజింగ్, టెస్టింగ్ తదితరాల్లో స్వావలంబన సాధించేందుకు ఇండియా నడుంకట్టింది. అందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఆదిలోనే సంక్లిష్ట చిప్ల జోలికి వెళ్లకుండా దేశవిస్తృత ప్రయోజనాల రీత్యా వ్యూహా త్మకంగా ముందుకు సాగాలని నీతి ఆయోగ్ రోడ్మ్యాప్ ఇటీవల సూచించింది. ఈ క్రమంలోనే గుజరాత్లోని సానంద్లో జపాన్, థాయ్లాండ్ సంస్థల సహకారంతో సిద్ధమైన కర్మాగారాన్ని ప్రధానమంత్రి మోడీ మొన్న ప్రారంభించారు. ఇది గడిచిన నాలుగు నెలల వ్యవధిలో పట్టాలకెక్కిన మూడో సెమీకండక్టర్ పరిశ్రమ కావడం విశేషం.

Read Also : India First Hydrogen Train: తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన మోదీ!

Technology
Technology

Technology : ‘మేకిన్ ఇండియా’

ఏడాదికి 20కోట్ల చివ్లతో మొదలుపెట్టి, రాబోయే రోజుల్లో కొత్త ప్లాంటు తయారీ సామర్ధ్యాన్ని 500 కోట్లకు తీసుకెళ్లాలన్నది లక్ష్యం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇక్కడినుంచి విదేశాలకూ ఎగుమతులు సుసాధ్యమై ‘మేకిన్ ఇండియా’ ప్రస్థానం మరోమెట్టుకు చేరుతుంది! దేశీయంగా సెమీకండక్టర్ల వినియోగం ప్రస్తుతంతో పోలిస్తే, 2030 నాటికి రెట్టింపవుతుందని అంచనా. పీఎస్ఐఐ వంటిపథకాల కారణంగా మొబైళ్ల తయారీలో ఇండియా ప్రపంచంలోనే రెండోస్థానానికి చేరింది. ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిసైతం కొన్నేళ్లుగా జోరందుకుంది. దాంతో సెమీకండక్టర్ల అవసరం అధికమైంది. వాటికోసం చైనా, తైవాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. గడిచిన తొమ్మిదేళ్లలో సెమీకండక్టర్ ఉత్పత్తులకు భారతా వని 15వేల కోట్లడాలర్ల విదేశ మారకద్రవ్యాన్ని ధారపోసిం ది. ఈ పరాధీనతలోంచి బయటపడేందుకు ఇప్పటిదాకా రూ.1.64 లక్షల కోట్ల విలువైన 12 సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టులకు ఇండియా ఆమోదం తెలిపింది. డిజైన్ అనుసంధానిత ప్రోత్సాహక పథకం కింద 24 చిప్ రూప కల్పన ప్రాజ క్టులకూ ఊతమిస్తోంది.

Technology
Technology

సాంకేతిక నిపుణుల లేమి వేధిస్తోంది

జపాన్, నెదర్లాండ్స్ వంటి దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలతో ముడినరు కులు, యంత్రాల సరఫరాలకు ఇబ్బందులు లేకుండాచూసు కుంటోంది. అందులో భాగంగానే అమెరికా నేతృత్వంలోని ‘ప్యాక్స్ సిలికా’లోనూ భాగమైంది. ఇలా ఈరంగంలో ఆత్మ నిర్భరత కోసం ప్రణాళికాబద్ధంగా కృషి జరుగుతున్నప్ప టికీ, ఇండియా అధిగమించాల్సిన సవాళ్లూ కొన్ని ఉన్నా యి! మైక్రో చిప్ల తయారీకి నిరంతరం విద్యుత్, నీటి లభ్యత తప్పనిసరి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగు ణం గా దేశీయంగా ఆ మౌలిక వసతులు పాదుకొనాల్సి ఉంది. ప్రపంచవ్యాప్త చిప్ డిజైనర్లలో 20 శాతం భారతీ యులే అయినప్పటికీ వాటి తయారీలో నేరుగా పనిచేయ గలిగిన సాంకేతిక నిపుణుల లేమి వేధిస్తోంది. సెమీకండ క్టర్లకు అత్యవసరమైన ముడిసరకుల కోసమూ విదేశాల వైపు చూడాల్సి వస్తోంది, సెమీకండక్టర్ల సరఫరా గొలుసు లో ప్రపంచానికి విశ్వసనీయ గమ్యస్థానంగా ఎదగాలన్న భారత్ కల నెరవేరాలంటే వీలైనంత వేగంగా సంబంధిత ఆవరణ వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలి.

-వనకల్ల వీరప్ప

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు