Poverty : దేశంలో పేదరికం తగ్గిందన్న గణాంకాలు ఏమి చెప్పినా క్షేత్రస్థాయిలో పేదరికం ఇంకా వెక్కిరిస్తూనే ఉంది. ఆర్ధిక వృద్ధి కొసచివర భాగంలో అలో లక్ష్మణా! అని ఏడవని వారు ఉన్నారని నిరూపితమయినప్పుడే పేదరికం తగ్గినట్లు భావించాల్సి ఉంటుంది. విభిన్న మానవాభివృద్ధి సూచికల్లో పేదరికం తాలూకు అంచనాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయి పరిశీలనలో అంశాల క్రోడీకరణ అనూహ్యంగా ఉంది. 2026 సంవత్సరం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ప్రపంచం లోని 122 దేశాల్లో భారత్ 100వస్థానంలో ఉంది. ఈ సూచికను కొన్ని ఐరిష్, స్విస్, జర్మన్ సంస్థలు సంయు క్తంగా విడుదల చేశాయి. ఈ సూచిక ప్రకారం జనాభాలో 9.8 శాతం మంది ఇప్పటికే పోషకాహార లోపంతో బాధ వడ్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 29శాతం మంది ఎదుగు దల లోపంతో ఉండగా కొంతమంది కనీస బరువును చేరు కోలేదు. ఇవన్నీ పేదరిక సూచీని నిష్ఫలం చేసేవే. సుస్థిరాభివృద్ధి అంశాలన్నీ సమర్థంగా చేరుకున్నప్పుడేదేశసౌభాగ్యం కనపడుతుంది. భారత్‌లో పేదరికం తగ్గిందనడానికి ఆయా ప్రభుత్వాలు చేపట్టిన సంస్కరణ, అభి వృద్ధి గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోవడం వలనే వాస్తవికతను ప్రతిబిం బింప చేయలేకపోవడం గమనార్హం.
Read Also : Hyderabad Water Crisis: హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తప్పవా? జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వలు!

Poverty : గణాంకాల పరంగా పేదరికం తగ్గినట్లున్న
2011-12లో నీతి ఆయోగ్ అంచనాల మేరకు దేశంలో 29.2 శాతంగా ఉన్న పేదరికం 2022-23 నాటికి 11.28 శాతం తగ్గినట్లు అంచనా వేయబడింది. ఈ మధ్యకాలంలో సుమారు 24.82 కోట్ల మంది బహుళ అంశాలలో పేదరికం నుంచి బయటపడినట్లు గోచరమవు తోంది. అయినా భారత్‌లో తీరని పేదరికం ఉందని పలు అంశాలపై చర్చకు వచ్చినప్పుడు అవగతమవుతోంది. దేశం ఎన్నో విధాలుగా అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థికవ్యవస్థకు తార్కాణంగా ఉన్న ప్పటికీ పేదల జీవన విధానం కానీ జీవన స్థాయి కానీ ఏమాత్రం మారలేదు. కానీ స్వల్పదాయ వర్గాలు మధ్యా దాయ వర్గాలుగా ఎంత మంది మారారు? అలాగే మధ్యా దాయవర్గాలు ఉన్నతవర్గాలుగా మారినవారు ఎంతమంది? అన్న అంశంలో కూడాపెద్దగా స్పష్టత కనిపించదు. కానీ పేదరికం తగ్గిపోయినట్లే సూచీల విషయంలో కూడా కొంత అస్పష్టత ఉంది. గణాంకాల పరంగా పేదరికం తగ్గినట్లున్న నాణ్యమైన జీవన ప్రమాణాల ద ృష్ట్యా క్షేత్రస్థాయిలో పరిశీ లనలు ఎన్నో సందేహాలు మిగులుస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో భారత్‌లో 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలన్న అంశం ప్రధానంగా ఉంది. దేశంలో 2021-2025ల మధ్య 415 మిలియన్ల మంది ప్రజలు పేదరికం నుంచి గట్టెక్కిన విషయాన్ని కొన్ని సర్వే నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి.
పథకాలవల్ల తాత్కాలిక ఊరట
2023 నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఈ అయిదేళ్లలో భారత్‌లో 10శాతంమంది పేదరికం నుంచి గట్టెక్కారు. ఇలాంటి సానుకూల మార్పు లకు దోహదపడు తున్న అంశాల్లో జరిగిన సర్వేల్లో వాస్త విక దృక్పథమే కనపడుతోంది. కానీ పేదలు, నిరుపేదలు ఇప్పటికీ ఆకలి కేకలువేస్తున్న సందర్భాలు మనంచూస్తూనే ఉన్నాం. ఆర్ధిక వ్యవస్థ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా సంపద కొన్ని వర్గాల వద్ద మాత్రమే కేంద్రీకృతమైంది. సం పన్నులు మరింత సంపన్నులుగా, పేదలు మరీపేదలుగా మిగిలి పోతున్నారనే భావన ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులలో నాణ్యత లోపించడంవల్ల ప్రైవేట్ రంగం లోకి మారడంతో ఆ విధంగా అయ్యే వ్యయం కుటుంబ ఆదాయవృద్ధిని దెబ్బతీస్తోంది. ఉచితాలు ఎన్ని అందుతున్నా వాటిలో పోషకాహార స్థాయి తక్కువగా ఉన్నందున ప్రతి గృహస్థు బహిరంగ మార్కెట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. స్థిరమైన ఉపాధి కల్పన, నాణ్యమైన విద్యసరసమైన ఫీజు లకు అంది వ్వడం, నైపుణాభివృద్ధికి ప్రోత్సహమిచ్చే పథ కాలను ప్రవేశ పెట్టే విషయంలో కేంద్రప్రభుత్వానికి ఇంకా బాధ్యతఉంది. ప్రభుత్వాలు అందించే ఉచిత రేషన్ నగదు బదిలీ వంటి పథకాలవల్ల తాత్కాలిక ఊరటమాత్రమే లభి స్తోంది. తప్ప స్వయం సమృద్ధి సాధించినట్లు కాదు. ఉద్యోగ లేదా ఉపాధి రహిత వృద్ధి వలన ఎంతో మందికి ఉపాధి లభిస్తోందని భావించినప్పటికీ తగిన వేతనాలు లేక వారి కొనుగోలు శక్తి అంతంత మాత్రంగానే ఉంది. తాత్కా లిక ఉపాధి ఎన్నడూ శాశ్వత జీవన వృద్ధి కానేరదు.

పెరుగుతున్న ఆర్థిక అసమానతల
ఏది ఏమయినా కారణంఏదైనా ఇటీవలి కాలంలో పెరిగిననిత్యా వసర వస్తువులు, ఇంధన, విద్యుత్, ర వాణాధరలు సామాన్య మానవుని జీవన వ్యయాన్ని కుదేలుచేస్తున్నాయి. పేదరిక మంటేఅదొక సామాజిక ఆర్థిక వేదనగా అన్నిదేశాలు గుర్తిం చినా భారతదేశం అంతర్గత సామాజిక జీవనాన్ని ప్రత్యేకం గానే గుర్తించాలి. కనీస అవసరాలైన ఆహారం, గృహవసతి, దుస్తులు పొందలేని పరిస్థితిని దుర్భరంగా భావిస్తాము. పేదరిక నిర్మూలన, సామాజిక పురోగతి కోసం చేపడుతున్న కార్యక్రమాలకు, పెరుగుతున్న ఆర్థికఅసమానతల వలన కలుగుతున్న ప్రయోజనాలకు మధ్య కొన్ని అంతరాలున్నా యి. వాటిని తొలగించే ప్రక్రియ సజావుగా సాగితే సంపన్నులు, పేదలు అనే రెండువర్గాల మధ్య ఎంతోకొంత తార తమ్యాలు తగ్గుతాయి. 1990నాటి మొత్తం జనాభాలో 36శాతం మంది పేదరికంలో ఉంటే 2025 నాటికి అది 10శాతానికి మాత్రమే తగ్గినట్లని వివిధ సర్వేలు చెబుతు న్నాయి. జీవన ప్రమాణాల సూచికలో తీసుకురాగలిగిన గణనీయ ప్రగతిమాత్రమే పురోగతిగా చెప్పుకోగలిగిన విష యం. దేశంలోని ప్రతి నలుగురిలోనూ ఒకరు పేదరికంలో ఉన్నారని చెప్పుకునే స్థాయి నుంచి, ప్రతి పదిమందిలో ఒక్కరు మాత్రమే పేదరికంలో మగ్గుతున్నారని చెప్పుకోద గిన స్థాయి అనగానే అది పేదరికం తగ్గిందనడానికి సంకే తమే. మరిన్ని ప్రజాప్రయోజనకర ప్రణాళికలు ద్వారా పేద రికాన్ని మరికొంత మేరకు తగ్గించవచ్చు. అందరికీ ఉపాధి దొరికిన సందర్భాల్లో పేదరికం తగ్గి ఆదాయ అసమాన తలు తగ్గుతాయి. తద్వారా పేదరికం తగ్గిందని చెప్పుకోవ డానికి మరో పెద్ద మంత్రదండం మనవద్ద ఉన్నట్లే.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: