Narcotics : చట్టాలకు సామాన్యులు లోకువైతే సమర్ధులకు చట్టాలు లోకువ అంటారు. ఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి అన్నారో కానీ మారిన కాలమాన పరిస్థితుల్లో ఇది అక్షరాల నిజమనిపిస్తున్నది. ఆర్ధిక, అంగ, అధికార, రాజకీయబలం ఉన్నవారు తప్పు చేస్తే చర్యల సంగతి అటుంచి వేలెత్తి చూపడానికి కూడా జంకే దురదృష్టపు పరిస్థితులు దాపు రించాయి. హత్యలు, అత్యాచారాలు చేసినవారు ఎందరో చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని నిర్భయంగా తిరగ గలుగుతున్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా మానవ జాతిని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల నియంత్ర ణలో అటు పాలకులు కానీ, ఇటు అధికార యంత్రాంగం కానీ సమర్ధవంతంగా వ్యవహరించలేకపోతున్నదేమోనని పిస్తున్నది. దేశవ్యాప్తంగా ఎంతో పోలీసు సిబ్బంది ఉంది. నిఘా వ్యవస్థలున్నాయి. ఏకంగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఉంది, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తదితర విభా గాలు ఎన్నో ఉన్నాయి. నిత్యం వెయ్యికళ్లతో నిఘా పెడు తున్నామని చెబుతున్నారు. అప్పుడప్పుడు మాదకద్రవ్యాల విక్రయదారులను పట్టుకుంటున్నారు కానీ ఇది ఆగడం లేదు. యేడాది యేడాదికి విస్తరిస్తూనే ఉంది. ఇటీవల కాలంలో దేశంలో విమానాశ్రయాల్లోనూ ఇతర ప్రాంతా ల్లోనూ పట్టుబడుతున్న మాదకద్రవ్యాలు వేల కోట్లల్లో ఉంటున్నాయి. ఆ మధ్య కేరళ సమీపంలో అరేబియా సముద్రంలో నౌకాదళం స్వాధీనం చేసుకొన్న మాదక ద్రవ్యాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు నాలుగువేల ఐదు వందల కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని అధికార వర్గాలే అంచనా వేశాయి. ఇది వ్యూహం ప్రకారం వలపన్ని పట్టుకున్నది కాదు. చాలా వరకు ఇలానే అధికారులు చేస్తున్న తనిఖీల్లో పట్టుబడుతు న్నాయి.
Read Also : TG Bars Lucky Draw: నార్సింగిలో ముగిసిన బార్ల లక్కీ డ్రా

Narcotics : ఆహార సరఫరా ముసుగులో మత్తు పదార్థాలు పంపిణీ
విమానాల్లో రహ స్యంగా తీసుకువస్తున్న మత్తు పదార్థాలు తక్కువేమీ కాదు. ఆహార సరఫరా ముసుగులో మత్తు పదార్థాలు పంపిణీ చేస్తున్న బాగోతం దేశంలో పలు చోట్ల బయటపడుతూనే ఉన్నది. పంజాబ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, హర్యానా, తదితర రాష్ట్రాల్లో మత్తుపదార్థాల వినియోగం అంతంతకు పెరుగుతున్నట్లు అధికార వర్గాలు అంగీకరిస్తున్నాయి. ముం బాయి, గోవా లాంటి నగరాలు కొకైన్కు కేంద్రాలుగా మారి నట్టు మాదకద్రవ్యాల నియం త్రణ సంస్థ అంగీకరించక తప్పడం లేదు. ఇక గంజాయి సాగు దేశంలో అనేక రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో నూ భారీగానే సాగుచేస్తున్నట్లు సమాచారం. అప్పుడప్పుడు ఎక్సైజ్ పోలీసు అధికారులు దాడులు చేసి గంజాయి వంటను ధ్వంసం చేస్తున్నా మళ్ళీ రెండు, మూడు నెలల్లో రెట్టింపు స్థాయిలో సాగులోకి వస్తున్నాయి. అడవుల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఈ సాగు చేసే స్మగ్లర్లు పట్టుబడగానే అదృశ్యమైపోతున్నారు. కేవలం ఆయా ప్రాంతాల్లోని అమా యక రైతులు, రైతు కూలీలు, ఈ కేసుల్లో ఇరుక్కుపోతు న్నారు. కొన్ని నంద ర్భాల్లో గంజాయి సాగు చేయడం చట్టప్రకారం నేరమనే విషయం కూడా ముఖ్యంగా గిరిజన రైతులకు తెలియడం లేదు. దీనిపై అవగాహన కలిగించ డంలో అధికారగణం విఫలమవుతున్నారే మోననిపిస్తున్నది.
తీవ్రవాద బృందాలకునిధులు అందిస్తున్నట్లు
ఇక అత్యంత విలువైన మాదకద్రవ్యాల రవాణా, వ్యాపా రంలో పట్టుబడుతున్నది పాత్రధారులే. వారి వెనుక ఉండే అసలైన సూత్రధారులను పట్టుకోలేక పోతున్నారు. మాదక ద్రవ్యాలు అనేక మార్గాల్లో భారత్కు చేరుకుంటున్నాయి. ఆఫ్ఘానిస్థాన్ నుండి ఆఫ్రికా మీదుగా భారత్కు చేరుకొని వివిధ మార్గాల ద్వారా దేశంలోని అన్ని నగరాలకు సర ఫరా చేస్తున్నారు. కొన్ని మాదకద్రవ్యాల ముఠాలు ఈశాన్య భారతంలోనూ వివిధ తీవ్రవాద బృందాలకునిధులు అంది స్తున్నట్లు సమాచారం. ఇది దేశ భద్రతకు అత్యంత ప్రమా దకరంగా తయారైంది. ఆ మధ్య మయన్మార్ వలసదారుల నుంచి పద్దెనిమిది ఆయుధాలు, డెబ్భైనాలుగు కోట్ల విలు వైన అక్రమ రవాణా వస్తువులు, దాదాపు రెండువందల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇక కేసుల విషయంలో కూడా సంబంధిత అధికార వర్గాలు అంతగా శ్రద్ధ వహించడం లేదనే విమర్శలు న్యాయస్థానాల్లో వీగి పోతున్న కేసులు సజీవ సాక్ష్యాలుగా మిగులుతున్నాయి. అందుకే మత్తు పదార్థాల రవాణాలో పట్టుబడినవారు జైలుకు వెళ్లినా తిరిగి వచ్చి అదే వ్యా పారంలో కొనసాగుతు న్నారు. వీటన్నిటికంటే మించి మత్తు ముఠాల కదలికలపై నిఘా వేసి నియంత్రించాల్సిన నార్కోటిక్ కంట్రోల్బ్యూరో, ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తదితర శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కూడా మత్తుపదార్థాల విస్తరణకు కారణమవు తుంది.

ఈ జాఢ్యం విస్తరించడం అత్యంత ప్రమాదకరం
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ప్రస్తుతం అంతకంతకు పెరిగి సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తుపదార్థాల వాడకం, వినియోగం ఆందోళన కలిగిస్తు న్నది. చాపకింద నీరులా ఈ స్మగర్లు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నారు. ఈ జాఢ్యం విస్తరించడం అత్యంత ప్రమాదకరం. మాదకద్రవ్యాలను నిరోధించే విషయంలో మాటలకే పరిమితం కాకుండా ఆచారణలో చూపించాల్సిన తరుణమిది. అవసరమైతే చట్టానికి మరింత పదును పెట్టాలి. ముఖ్యంగా మాదకద్రవ్యాల సరఫరాలో పట్టుబడుతున్న పాత్రధారులను కాకుండా అసలైన సూత్ర ధారులను బయటకు తీయాలి. ఉత్పత్తి, నిల్వ, వినియోగం వ్యాపారానికి పాల్పడడం అత్యంత తీవ్రమైన నేరాలుగా కొన్ని దేశాలు పరిగణిస్తున్నాయి. కాంబోడియా, వియత్నాం, సింగపూర్, థాయిలాండ్ లాంటి దేశాలు ఈనేరా లకు ఏకంగా మరణ శిక్ష విధిస్తున్నాయి. పాలకులు అలాం టి కఠిన శిక్షల వైపు దృష్టిసారించాలి. ఒక్కసారి మాదక ద్రవ్యాల వ్యాపారంలో, రవాణాలో పట్టుబడి రుజు వైతే శాశ్విత జైలు జీవితమే శరణ్యమనే భయం ఆ స్మగ్లర్లలో కలిగించాలి. అన్నింటి కంటే ముఖ్యంగా పాత్రధారులే కాదు సూత్రధారులను కూడా పట్టుకుంటే తప్ప ఇది ఆగే పరిస్థితులు కన్పించడం లేదు. ఇందులో ఏ మాత్రం జాప్యం చేసిన యువతపై తీవ్ర ప్రభావం చూపి నేర ప్రవృత్తి పెరిగి అరాచకం ప్రబలే ప్రమాదం ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: