Mid-day meal : విద్యార్థుల కడుపు నింపేందుకు మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వం చెల్లించేబిల్లులు ఏమాత్రం పొంతన లేకపోవడంతో వంట చేయ డం ఆర్థిక భారంగా మారుతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విద్యా ర్థులకు వడ్డించే కోడిగుడ్డు బయట మార్కెట్లో రూ.8 నుంచి రూ.9 ఉండగా, ప్రభుత్వం రూ.6 మాత్రమే చెల్లిస్తుండడం ఎంతవరకు సమంజ సమని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు పౌష్టి కాహారం అందించడానికి అమలు చేస్తున్న మధ్యాహ్నభోజన పథకం వంటఏజ న్సీలకు భారంగా మారుతోంది. విద్యార్థు లకు నాణ్యమైన భోజనం అందించడానికి రోజురోజుకూ పెరుగుతోన్న కూరగాయలు, నిత్యావసర సరుకులతోపాటు కోడిగుడ్ల ధరలు అడ్డంకిగా మారుతున్నాయి. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లిస్తున్న వంట ఖర్చులు ప్రస్తుత మార్కెట్ ధరలకు ఏమాత్రం సరిపోవడంలేదు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు రవాణా చార్జీలు పెరిగాయి. దీంతో నిత్యావసర సరుకుల ధరలు సైతం ఆకా శాన్నంటుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా కూర గాయల దిగుబడి తగ్గిమార్కెట్లో ఒక్కసారిగా ధరలు పెరిగి పోతున్నాయి.
Read Also : AP Weather Update: ఏపీలో వారం పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

Mid-day meal : నిర్వహణ మోయలేని భారంగా
ఇటీవలకాలంలో కోడిగుడ్ల ధరలు సైతం గణ నీయంగా పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన మధ్యాహ్న భోజన మెనూను అమలు చేయడం కష్టసాధ్యంగా మారిపోతోందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు లక్షల సంఖ్య లో వున్నాయి. వీరికి పీఎం పోషణ్ మధ్యాహ్నభోజన పథ కం కింద అమలుకు రాష్ట్ర ప్రభుత్వం 40శాతం, కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను భరిస్తోంది. మధ్యాహ్న భోజనం అందించడానికి కుక్స్ కం హెల్పర్స్ ఏజెన్సీలుగా పనిచేస్తున్నారు. ప్రతీరోజు మెనూ ప్రకారం వంటలు చేసి వడ్డిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వం ప్రస్తుతం రోజువారి చార్జీల కింద ఏజెన్సీలకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు రూ.6.78 పైసలు, ప్రాథమికోన్నత (6 నుంచి 8వ తరగతి) విద్యార్థులకు రూ.10.17. ఉన్నత పాఠశా లల్లో 9,10 తరగతుల విద్యార్థులకు రూ.13.17 చెల్లిస్తు న్నారు. కోడిగుడ్డుకు అదనంగా రూ.6 చెల్లిస్తారు. ప్రస్తుత మెనూ ప్రకారం వారంలో మూడు రోజులు ఒక్కో విద్యార్ధికి ఒక్కో కోడిగుడ్డును అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా పారితోషికంగా నెలకు రూ.3వేలు చెల్లించనున్నారు. ఒక్క కోడి గుడ్డుపై రూ.2భారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థు లకు మధ్యాహ్న భోజనంకోసం ప్రభుత్వం అందిస్తున్న మెన్చార్జీ, వంట ఖర్చులు మార్కెట్ ధరల ప్రకారం ఏ మాత్రం సరిపోని పరిస్థితులున్నాయి.
ఏజెన్సీల మీద ఆర్థిక భారం
విద్యార్థులకు వారంలో మూడు రోజులు అందించే ఒక్క కోడిగుడ్డుపైనే రూ.2 అదనపు భారం ఏజెన్సీలపై పడుతోంది. వంటగ్యాస్, కూరగాయలు ధరల పెరుగుదలతో ఏజెన్సీల నిర్వహణ మోయలేని భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తంచేస్తు న్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రభుత్వం నిర్ణ యించిన ఛార్జీల్లో పౌరసరఫరాల శాఖ సరఫరా చేసే సన్న బియ్యం, మినహా మధ్యాహ్న భోజన, మెనూ ప్రకారం సిద్ధం చేయడానికి అవసరమైన నిత్యావసర సరుకులు ఏజె న్సీలే సమకూర్చాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం పెరుగు తున్న ధరల ప్రకారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థుల సంఖ్య ఆధారంగా వారానికి మూడు కోడిగుడ్లు అం దించడం ద్వారా సంబంధిత ఏజెన్సీల మీద ఆర్థిక భారం పడుతుంది. వారం రోజుల మెనూ అమలు సైతం సమస్య అవుతుంది. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పౌష్టికా హారం అందించే లక్ష్యంతో సోమవారం నుంచి శనివారం వరకు మెనూ నిర్ణయించింది. ఈ మెనూ ప్రకారం కూరగా యలు, సాంబారు, పప్పు దినుసులు, ఆకు కూరలతోపాటు చిక్కి వంటి పోషకాహార పదార్థాలను అందించాల్సి ఉంటుం ది. అయితే పెరిగిన నిత్యావసర సరకుల ధరలతో నాణ్యమైన భోజనం అందించడం కష్టసాధ్యమవుతుందని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాత్ర ంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల ప్రభావం కూరగాయల దిగుబడి పై పడింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్న టమాట, బీరకాయ, బెండకాయ, బీన్స్, క్యారెట్, ఆకుకూరల ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. పప్పులు, వంట నూనె, పసుపు, కారం ఇతర మసాల దినుసుల ధరలు సైతం విపరీతంగా పెరిగాయి. వంటగ్యాస్ ధరలు పెరగడం తో ప్రభుత్వం నిర్ణయించిన వంటచార్జీలతో నాణ్యమైన సరుకులు అందించలేకపోతున్నామని నిర్వాహకులు అంటు న్నారు. నాణ్యతలో రాజీపడినప్పటికీ ప్రతీనెల అప్పులుచేసి, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాల్సిన పరిస్థితు లు నెలకొన్నాయని వారు చెబుతున్నారు.

ప్రతీ విద్యార్థికి కనీసం రూ.25 చెల్లించాలి
పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన వంట చార్జీ లను ప్రభుత్వం పునఃసమీక్షించాలని వంట ఏజెన్సీలు కోరు తున్నాయి. పెరిగిన ధరల ప్రకారం ప్రతీవిద్యార్థికి రూ.25 మెన్చార్జీగా నిర్ణయించాలని కోరుతున్నారు. అదేవిధంగా కోడిగుడ్లు, వంటగ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని సూచిస్తున్నారు. ఈమేరకు వంట ఏజెన్సీ సంఘాలు జిల్లా కలెక్టర్లకు, విద్యాశాఖాధికారులకు తమ సమస్యల పరిష్కా రంకోసం వినతిపత్రాలు, ధర్నాలు, ఆందోళనలు సైతం చేపడుతున్నారు. మధ్యాహ్న భోజన వంట చార్జీలను పెం చాలి. నిత్యావసర వస్తువుల ధరలతోపాటు కోడిగుడ్ల ధరల పెరుగుదల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో వంట ఏజె న్సీలు ఆర్థికంగా నష్ట పోవల్సివస్తోంది. ప్రస్తుతం మార్కెట్ రేట్లకు, ప్రభుత్వం అందిస్తున్న కుకింగ్ చార్జీలకు పొంతన లేదు. మార్కెట్లో ఒక్క కోడిగుడ్డు ధర రూ.8 నుంచి రూ.9 ఉండగా, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.6. చెల్లిస్తుంది. పిల్లలకు పెద్దసైజు కోడిగుడ్డు పెట్టడం ద్వారా ఏజెన్సీ ఒక్క కోడిగుడ్డుపై రూ.2 నుంచి రూ.3 నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం కుకింగ్ చార్జీలను సమీక్షించి, తక్షణమే పెంచాలి. ప్రతీ విద్యార్థికి కనీసం రూ.25 చెల్లించాలి. వంటగ్యాస్, కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేసి విద్యార్థులకు నాణ్య మైన పౌష్టికాహారం అందించాలి.
-కామిడి సతీష్ రెడ్డి
Read hindi news : hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: