Lord Jagannatha : సర్వరక్షకుడు జగన్నాథుడే…

Follow Us: Google News Daily Hunt
Lord Jagannatha
Lord Jagannatha
FONT SIZE
GET APP

Lord Jagannatha : శ్రీ జగన్నాథుడి ప్రార్ధనలు, కీర్తనలు చిన్ననాటి నుంచి నా జ్ఞాపకాల్లో పదిలమై ఉన్నాయి. పాఠశాలలో, కళా శాలలో చదువుకొనేటప్పుడు మహాప్రభు జగన్నాథుని భజ నలు పాడటం నాకు చాలా ఆనందాన్నిచ్చేది. మహా ప్రభుకి చాలా సన్నిహితంగా ఉన్నఅను భూతి కలిగేది. నేనీ మధ్య భజనలు పాడటం లేదు కానీ, ప్రతి రోజూ ఆ మహా ప్రభుని స్మరిస్తాను. భజనలోని ఓ నాలుగు పదాలైనా వలకని రోజుండదు. నిజానికి మహా ప్రభు నాకు దగ్గరగా ఉన్నట్టు భావిస్తుంటాను. కష్ట నమ యాల్లో ఆయన నాకు అండగా ఉన్నారు. ఈనాటికీ భక్త కవి మధుసూదనరావు రచించిన పాటను పాడుతూనే ఉంటాను. అంతటా ఉండే ఓ మహాప్రభూ… నువ్వు రాత్రింబగళ్లు నా తోడే ఉన్నావు… ఈ జ్ఞాపకంతో నిన్ను ఎల్లప్పుడూ పూజిస్తాను.. నా పూర్ణ హృదయంతో.. అని ఆ పాటకి అర్ధం. లౌకిక విషయాలు అర్ధం చేసుకొనే వయసు వచ్చేనాటికి మహాప్రభు జగన్నాథు ని గొప్పదనాన్ని అర్ధం చేసుకోవడం ప్రారంభించాను. మహా ప్రభు జగన్నాథుని గురించి ఇంట్లో తరచూ మాట్లాడుకొనే వారు. మా గ్రామం లోనూ ఇలాంటి చర్చలే ఎక్కువగా జరుగుతుండేవి. నేను గ్రామ పాఠశాలలో చదువుతున్నప్పుడు భక్త సాల్బేగ్ రచిం చిన ‘ఆహే నీల శైల’అనే ప్రార్ధనను క్రమం తప్పకుండా పఠించేవారు. మహాప్రభు జగన్నాథుని గురించి మా టీచర్ అనేక విషయాలు చెబుతూ ఉండేవారు.

Read Also : Jagannath Rath Yatra : రథయాత్ర సందర్భంగా లోకకల్యాణం కోసం ప్రధాని మోదీ ప్రత్యేక ప్రార్థనలు

Lord Jagannatha
Lord Jagannatha

Lord Jagannatha : ఎంత తేజోవంతమైన దేవతా మూర్తులు

పూరీలో పెద్ద ఆల యం ఉంది. అంతటి గొప్ప ఆలయం మరొకటి లేదు! ఆ ఆలయంలో తన చెల్లెలు సుభద్ర, సోదరుడు బలభద్రుని తో కలసి మహాప్రభు పూజలందుకుంటారు. మహా ప్రభు జగన్నాథుడు నల్లని రంగులో, గుండ్రని కళ్లతో ఉంటారు. సుభద్ర పసుపు రంగులో, బలభద్రుడు వెన్నెల్లో వికసించిన పుష్పంలా శ్వేతవర్ణంలో ఉంటారు. ఒక ఇసారి ఆ మూర్తు లను చూస్తే.. ఎప్పటికీ మరచిపోం అని చెప్పేవారు. జగన్నాథుడే మహాప్రభువనీ, ఆయన ప్రసాదమే మహా ప్రసాదమని కూడా మా టీచర్ చెప్పే వారు. ఆయన ఆల యమే బడ దేవుళ్ల లేదా పెద్ద ఆలయం. ఆయన మార్గమే బడ దాండ. అంటే ఉత్కృష్ట మార్గం. ఆయన సముద్రమే మహోదధి లేదా గొప్ప మహాసముద్రం, మయూర్భంజ్ జిల్లాలోని మా ఊరు ఉపర్బేదా నుంచి పురుషోత్తమ క్షేత్రం పూరీ చాలాదూరంలో ఉంటుంది. మరి పూరీని సందర్శించే అవకాశం నాకెలా వస్తుంది? నేను పెద్దయ్యాక, భువనేశ్వర్ కి వెళ్లాను. అక్కడ బాలికల ఉన్నత పాఠశాలయూనిట్-2లో చేరాను. అక్కడే వసతిగృహంలో ఉండే దాన్ని. అక్కడ ఉన్నప్పుడే పూరీ, భువనేశ్వర్, కోణార్క్ సందర్శించే అవకాశం నాకు లభించింది. మొదటిసారి మహాప్రభును దర్శించుకున్న జ్ఞాపకం ఇప్పటికీ నామదిలో స్పష ంగాఉంది. ఎంత అద్భుతమైన ఆలయం! ఎంత తేజోవంతమైన దేవతా మూర్తులు! వాటిని మరచిపోగలమా? ఎవరైనా మహా ప్రభు జగన్నాథుని రథయాత్రను మరచి పోగలరా? శ్రీ క్షేత్రలో ఏడాదిలోని పన్నెండు నెలల్లో పదమూడు ఉత్సవాలు జరు గుతాయి. కానీ రథయాత్ర వైభవం మాత్రం అద్వితీయం.

సుఖ దుఃఖాలకు ఆయనే మూలం

మహాప్రభు దర్శనంకోసం ఏడాది పొడవునా భక్తులు ఆల యాన్ని సందర్శిస్తారు. కానీ ఏడాదికోసారి మహాప్రభువే ఆలయాన్ని వదలి విశాల పథంలో గుండిచా ఆలయానికి చేరుకొని భక్తు లకు దర్శన మిస్తారు. మూడు అద్భుతమైన రథాలపై చక్రరాజ సుదర్శనునితో పాటు ముగ్గురు దేవతా మూర్తులు గుండిచా ఆలయానికి చేరుకుంటారు. అక్కడే ఏడురోజులు ఉండి, ఆ తర్వాత తిరుగుప్రయాణమవుతారు. అత్యంత వైభవోపేతమైన ఈ మహాప్రభు ఉత్సవానికి సాటి లేదు. చిన్నతనం నుంచి మహాప్రభు జగన్నాథుని భక్తురాలి ని. నేను అత్యంత భక్తిభావంతో కొలిచే దైవం ఆయన. నా జీవితంలో ఒడిదొడుకులను నిర్ణయించేది ఆయనే. నా సుఖ దుఃఖాలకు ఆయనే మూలం. నా జీవితంలో ఎన్నోకష్టాలను ఎదుర్కొన్నాను. ఆ సమస్యలన్నింటి నుంచి మహాప్రభు నన్ను బయటకు తీసుకొచ్చారు. ఎంతైనా నేను ఆయన బిడ్డనే కదా. భారత రాష్ట్రపతి” పదవికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు.. నేను భక్తిపూర్వకంగా మహా ప్రభుని తలచుకున్నాను. నన్ను ఇంత పెద్దస్థాయికి తీసుకెళుతు న్నావు. నన్ను ముందుకు నడిపించు, ఎప్పుడూ నాతోనే ఉండు అని ప్రార్ధించాను. ఆయన నా మొర ఆలకించారు.

ఆయన అనుమతిస్తేనే ఎవరికైనా ఆయన దర్శనం

నా ప్రార్ధనకు ఆయన ఎప్పుడూ స్పందిస్తారు. నేను రాష్ట్ర పతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో… రథయాత్ర ఉత్సవం జరిగింది. నేను అప్పుడు ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. పూరీ వెళ్లడం సాధ్యం కాలేదు. రథయాత్ర రోజు ఉదయమే నేను ఢిల్లీలోని హాయ్ఫాన్లో ఉన్న శ్రీజగన్నాథుని ఆలయానికి వెళ్లాను. మహా ప్రభు దర్శనం చేసుకున్నాను. నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆయన నాపై తన ఆశీస్సులను కురి పించారు. పూర్తి విశ్వాసంతో నేను నామినేషన్ దాఖలు చేశాను. అత్యంత ఉత్సాహంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. 2022 జులై 25న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పార్ల మెంట్ సెంట్రల్ హాలుకి వెళుతూ.. దారిలో నేను మహాప్రభు జగన్నాథుని స్మరి స్తూనే ఉన్నాను. ఆయన ఆశీస్సులతో, కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. రాష్ట్రపతిగా నేను మొదటిసారి ప్రసంగించినప్పుడు ఆయన నాతోనే ఉన్నట్టు అనిపించింది. అయినప్పటికీ.. మహాప్రభు దర్శనం కోసం నా హృదయం పరితపించింది. రోజులు గడచిపోతున్నాయి. కానీ పూరీ వెళ్లడం సాధ్యం కాలేదు. ఆయన అనుమతిస్తేనే తప్ప ఎవరికైనా ఆయన దర్శనం ఎలా లభిస్తుందని నాకు అని పించింది. మహాప్రభూ! నేనేదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. దయచేసి నన్ను పూరీకి పిలిచి.. మీ దర్శన భాగ్యం ఇవ్వండి అనిమౌనంగా ప్రార్ధించాను. భావా లకు లేదా భావోద్వేగాలకు కూడా ఆయనే మహాప్రభు. నా ఆలోచనలను ఆయన ఎలా అర్ధం చేసుకోకుండా ఉంటారు? అనతి కాలంలోనే పూరీ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఆ రోజు 2022 నవంబరు 10. పూరీకి చేరుకున్న తర్వాత వాహన శ్రేణి శ్రీ మందిర్ దిశగా ముందుకు వెళుతోంది. పూరీలోని బడదాండ వద్దకు చేరుకోగానే అనిర్వచనీయమైన అనుభూతి నన్ను ముంచెత్తింది. బడదాండ శ్రీజగన్నాథునిది. ఇక డ ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం ఉందా?

Lord Jagannatha
Lord Jagannatha

దేవుళ్లకే దేవుడు మహాప్రభు

అన్ని పుణ్య క్షేత్రాల్లోనూ క్షేత్ర రాజంగా పూరీ ప్రసిద్ధి చెందింది. దేవుళ్లకే దేవుడు మహాప్రభు. ఎలాంటి ఆలోచనలు లేకుండా నా కారుని ఆపించాను. నా కారు ఆగగానే వెనుక వస్తున్న కార్లనీ కూడా ఆగిపోయాయి. ఏం జరుగుతుందో మిగిలిన వారికి అర్థమయ్యేలోపే.. చెప్పులు లేకుండా బడ దాండపై నదవడం మొదలుపెట్టా ను. అక్కడికి శ్రీ మందిర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయ శిఖరం మీద ఉన్న నీలచక్రం, పతిత పావన ధ్వజం మీదే నా దృష్టిని సారించి ముందుకు సాగాను, ముందుకు నడుస్తూనే.. రోడ్డుకిరు వైపులా ఉన్న బాలలు, మహిళలు, యువత, పెద్దలకు నమ స్కరిస్తూనే ఉన్నాను. కానీ నా దృష్టి మాత్రం మహాప్రభు మీదే ఉంది. ఆలయ సింహద్వారానికి చేరుకొనే సరికి.. నేను స్థిమితంగా ఉండలేకపోయాను. అప్పటికే నన్ను నేను మరచిపోయాను. బడ దాండ మీద దుమ్ములోనే సాష్టాంగ నమస్కారం చేసి ఆ మహాప్రభుకి నా ప్రణామాలు అర్పిం చాను. ఆ తర్వాత నేను గుడిలోకి వెళ్లాను. గర్భగుడికి చేరుకొని నలుగురు దేవతామూర్తులను దర్శనం చేసుకుని, దైవికానందంతో ఉప్పొంగి పోయాను. ఈ విశ్వానికి రక్షకుడు మహాప్రభువే. అందరూ వదిలేసిన వారికి కూడా ఆయనే రక్షకుడు. లోకం లోని జనుల కష్టాలను తీర్చేందుకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అందుకే ఆయన విశాలమైన గుండ్రటి నేత్రాలు ఎప్పుడూ రెప్ప వాల్చవు. ఆయనకి పెద్దాచిన్నా తారతమ్యం లేదు. ఆయన దృష్టిలో అందరూ సమానులే, సమానత్వమే ఆయన మంత్రం. ఆయన దీవెనలతోనే.. సమాజంలోని ప్రతి వర్గానికి సేవ చేసేందుకు నన్ను నేను అంకితం చేసుకున్నాను. గుండ్రని కన్నులతో ఉన్న మహాప్రభు జగన్నాథుని చూస్తూ.. ఓ మహాబాహూ! ప్రజలకు సేవ చేయాలనే నా అంకితభావం కొనసాగేలా ఆశీర్వదించు. ఓ కృపానిధీ! నా ధేశాన్ని, ఈ ప్రపంచాన్ని రక్షించు అని చేతులు జోడించి పార్ధించాను. ఇలా చెబుతూ భక్తిభావంలో లీనమైపోయాను.

-రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు