youth : ‘జై యువతకు సెల్యూట్!

Follow Us: Google News Daily Hunt
youth
youth
FONT SIZE
GET APP

youth : ఎవరు అన్నా అనకున్నా ఇప్పుడు భారతీయ యువ తను అభినందించాల్సిన పరిణామాలే తారసపడు తున్నాయి. ఓ పక్కజీవితాల్లో వెలుగులు నింపాల్సిన ప్రభుత్వాలు ఇన్నాళ్లూ వారి వారి సొంత ఎజెండాలతో కాలక్షేపం చేసేస్తాయి. కొత్త తరపు ఆలోచనలను ఎవరై నా, ఎప్పుడైనా స్వాగతించవలసిందే. యువత తమ భవిత కోసం రోడ్డెక్కితే వారిని ఏలిన వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారన్న భావనతో విదేశీ నిధులు వస్తు న్నాయనో, వారి వెనుక ఉండి ఎవరో నడిపిస్తున్నారనో ఒకవర్గం సామాజిక మాధ్యమాల్లో ఊదరగొడుతున్నాయి. అంటే ప్రశ్నించే వారు ఉండకూడదనేది వారి ఆంత ర్యమా!? ప్రశ్నిస్తే తప్పా? మరెందుకలా ఉద్యమకారు లపై బురద జల్లి యువత గొంతు నొక్కాలన్న ప్రయ్నత్న మంచిది కాదేమో? ఉద్యమకారుల్లో గత రాజకీయ నేపథ్యం ఉండడం నేరమా? వాళ్ళకి సిద్ధాంతాలు ఉండవా? ఉండకూడదా? అయినా యువ చైతన్యాన్ని ఎవరూ ఆపలేకపోయారు. నిజానికి అతి చిన్న వయసు లోనే ఈ తరం యువత పరిణితి చెందారు. ఎన్నో విషయాలపై అవగాహన పెంచుకొని పట్టుసాధిస్తున్నారు. వాళ్లల్లో మేధాశక్తికి కొదువ లేదు. వారికి అనుభవం తక్కువని అనుకోవాలి తప్ప కొత్త తరంలో మానసిక పరివర్తనను ఏమాత్రం తక్కువ చేయలేం. వీధుల్లోకి వచ్చిన యువత ఆగ్రహం ఒక్క పరీక్ష గురించో, ఒక్క మంత్రి రాజీనామా గురించో కాదు. అది చాలా కాలంగా విద్యావ్యవస్థపై పేరుకుపోయిన అసంతృప్తి.

Read Also : CJP protest : విద్యార్థులపై అరాచకాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: CJI

youth
youth

youth : ‘యూత్ బల్జ్

తమ చదు వుకు విలువ ఉందో లేదో? ఉద్యోగం వస్తుందో రాదో? భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే ఆందోళన, కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరిగిన ‘నీట్’ ఉద్యమాన్ని ప్రభుత్వం గుర్తించి వారి ఆకాంక్షలపై సానుకూలంగా స్పందించడం, తమకు తమ భవితవ్యమే తప్ప ఈ దేశ రాజకీయాలతో సంబంధం లేదని చెప్పడంలో యువత విజ్ఞత చెప్పుకోదగినది, అందుకే యువత వైఖరితో యావత్తు భారత దేశం ఊపిరిపీల్చుక్నుది. ప్రపంచంలోనే అతిపెద్ద యువదేశం భారత్ 2026 నాటికి భారత జనాభాలో 65 మంది 35 ఏళ్లలోపు వారు. 15-29 ఏళ్లమధ్య ఉన్న యువత 25కోట్లకు పైగా ఉంది. ప్రపం చంలోని ప్రతి 5గురు యువకుల్లో ఒకరు భారతీయుడు. దీన్నే ‘యూత్ బుల్జ్ లేదా డెమోగ్రాఫిక్ డివిడెండ్’ అంటారు. యువత ఎక్కువ, వృద్ధులు తక్కువ ఉన్న ప్పుడు పని చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఉత్పత్తి, పొదుపు, పెట్టుబడి పెరుగుతాయి. 2026-2047 వరకు ఇదే భారత్ వికసిత్ భారత్ గా మారేందుకు స్వర్ణావకాశం. జపాన్, చైనా, యూరప్ వృద్ధుల దేశాలుగా మారుతున్నాయి. 2030 నాటికి ప్రపంచానికి 12 కోట్ల మంది పనివారు కావాలి. ఆ ఖాళీని భారత యువత మాత్రమే భర్తీ చేయగలదు. భారత యువత ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతులు, ఆశావాదులు, టెక్ సావీ, వారికి సరైన విద్య, నైపుణ్యం, అవకాశం ఇస్తే వారు ‘వికసిత్ భారతిని నిర్మించడమే కాదు, ప్రపంచాన్నే నడిపిస్తారు.

ఉద్యోగాల వేట

ప్రతి ఏడాది కోటికి పైగా యువత డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. 2023-24లో సుమారు 1.1 కోట్ల మంది, 2024 -25లో దాదాపు 1.2 కోట్ల మంది గ్రాడ్యుయేట్లు బయటకు వచ్చారు. కానీ వారందరికీ ఉద్యోగాల వేటలో తలపండిపోతోంది ఫలితం శూన్యం. 2000 నుంచి 2010 మధ్య దేశంలో ప్రతి ఏడాది సగటున రెండున్నర కోట్లమంది పిల్లలు జన్మించారు. ఆ తరం ఇప్పుడు ఉపాధి కోసం బయటకు వస్తోంది. రాబోయే మరో 15 నుంచి 20 సంవత్సరాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆర్థికవేత్తలు దీనినే “డెమోగ్రాఫిక్ డివిడెండ్’లేదా ‘యూత్ బల్జ్’ అంటారు. ఇది ఏ దేశానికైనా ఒక్కసారి మాత్రమే దక్కే అవకాశం. 2050 నాటికి ఈ అవకాశం క్రమేపీ ముగుస్తుంది. అంటే మరో పాతికేళ్లే భారత్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ప్రతి ఏడాదిసంక్షేమ పథకాల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, తయారీరంగం, చిన్న పరిశ్ర మలపై కూడా భారీ పెట్టుబడులు పెట్టాల్సిన సమయం వచ్చింది.

youth
youth

ప్రజా సేవపట్ల నిబద్ధత

యువత ఉచితాలు కోరుకోవడం లేదు. భారత్ ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్థికశక్తిగా నిలిపేయువతమనకు సొంతం. ‘జెన్ జి’ ఉద్యమ స్పందనతో యువశక్తిని సరైన దారిలో నడిపించి దేశభవితలో వారిని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక ప్రత్యేక సందర్భంలో అభిప్రాయపడ్డారు. జై జవాన్’, ‘జై కిసాన్’ లతో ముందుకుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ‘జై యువ’ నినాదాన్ని కలుపుకొని ముందుకెళ్తున్నట్లు ప్రకటించారు. అందరికీ విద్య అందుబాటులోకి వచ్చినం దున 21ఏళ్ల వయసుకే ఐఎఎస్, ఐపిఎస్లు అవుతున్నా రు. అదేదారిలో యువతను పార్లమెంట్ తదితర చట్ట సభల్లో భాగస్వాములు అయ్యేందుకు వీలుగాఎన్నికల్లో పోటీ చేసే వయసును తగ్గించే అంశం పైచర్చ పూర్తిస్థాయి లో కొనసాగాలని అభిలషించారు. అసెంబ్లీ, లోక్సభకు పోటీచేసే వయసు 21 సంవత్సరాలకు, రాజ్యసభ, శాసనమండలికి పోటీ చేసే వయసు 25 సంవత్సరాలకు తగ్గించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. యువతకు ఉద్య మాలతో పనిలేకుండా వారి ఆకాంక్షలను నెరవేర్చగలిగితే వారిలో అసంతృప్తి దూరమవుతుంది. యువతకు రాజకీయ నాయకత్వ అవకాశాలు ఇవ్వడమే కాదు ప్రజా సేవపట్ల నిబద్ధత ఉన్న వారికే ఆ అవకాశం దక్కేటట్లు చూస్తేనే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష, అనేకరంగాల్లో యువత నిర్మాణాత్మక హోదాల్లో తమను తాము నిరూపించుకున్న యువతకు పాలనలో భాగస్వామ్యం కల్పించడంలోనూ ఎవరికీ ఏ అభ్యంతరం ఉండదు. యువశక్తిని గుర్తించిననాడే వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరి వికసిత్ భారత్కు కొత్తదారి గోచరమవుతుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు