Inflation : రెండువేల ఇరవైఆరు ఆర్ధిక శాస్త్ర నోబెల్ పురస్కా రాన్ని రాబర్ట్ ఈ. హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్లకు ప్రకటించ డం ఆర్ధిక విధానాల ముందుఉన్న కీలక ప్రశ్నను గుర్తుచే స్తోంది. దీర్ఘకాలిక వృద్ధికి ఆటంకం కలగకుండా ఆర్ధిక ఒడు దొడుకులను ఎలా తగ్గించాలి? ప్రజలు, వ్యాపార సంస్థలు తీసుకునే నిర్ణయాలు దేశ ఆర్ధిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడంలో వీరి పరిశోధనలు తోడ్పడ్డా యి. భారతదేశానికి ఇందులోని ప్రధాన సందేశం స్పష్టం. వడ్డీ రేట్లను మార్చడం, వృద్ధి గణాంకాలను పెంచడం మాత్రమే సరిపోదు. ప్రజల ఆదాయాలు, ఖర్చులు, భవి ష్యత్తుపై అంచనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక విధానా లను రూపొందించాలి. జీడీపీ, ధరల పెరుగుదల, నిరుద్యో గం వంటి గణాంకాలు ఆర్ధిక పరిస్థితిని తెలియజేస్తాయి. కానీ వాటి వెనుకఉన్న కారణాలను పూర్తిగా వివరించలేవు. కుటుం బాలు తమ ఆదాయం, పొదుపు, రుణ నదు పాయాలను బట్టి ఖర్చులు నిర్ణయించుకుంటాయి. వ్యాపార సంస్థలు భవి ష్యత్తులో గిరాకీ, రుణ వ్యయం, ఆర్ధిక అనిశ్చితిని అంచనా వేసుకుని పెట్టుబడులు పెడతాయి. ఈ నిర్ణయాలుపరస్పరం ప్రభావితం చేసుకుంటూ వృద్ధికిఊతమివ్వవచ్చు లేదామంద గమనాన్ని తీవ్రం చేయవచ్చు. ఉదాహరణకు, భవిష్యత్తులో ఉద్యోగాలు తగ్గుతాయనే భయం ప్రజల్లో పెరిగితే వారు ఖర్చులను తగ్గిస్తారు. గిరాకీ పడిపోతుందన్న అంచనాతో సంస్థలు పెట్టుబడులను వాయిదా వేస్తాయి. దీంతో ఉత్పత్తి, ఉపాధి మరింత తగ్గే ప్రమాదం ఉంటుంది. ఈ పరస్పర సంబంధాలను అర్ధం చేసుకోవడానికి హాల్, వుడ్ఫోర్డ్ పరిశోధనలు బలమైన పునాదిని అందించాయి.
Read Also : Stock Market Today: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..!

Inflation : ఆర్ధిక నిర్ణయాలను మార్చుకోవచ్చు
ప్రజలు ప్రస్తుత ఆదాయాన్నే కాకుండా భవిష్ ్యత్తులో వచ్చే ఆదాయా న్ని కూడా అంచనా వేసుకుని ఖర్చులు చేస్తారని హాల్ పరి శోధనలు వివరించాయి. ఉద్యోగం, వేతనం, భవిష్యత్తు అవకాశాలపై నమ్మకం ఉంటే తాతా లిక ఇబ్బందుల్లోనూ కొందరు ఖర్చులను కొనసాగిస్తారు. అనిశ్చితి పెరిగితే ఖర్చు లు తగ్గిస్తారు. అయితే, పొదుపు తక్కువగా ఉండి, రుణ సదుపాయాలు పరిమితంగా ఉన్న కుటుంబాలకు ఆదాయం తగ్గిన వెంటనే ఖర్చులు తగ్గించడం తప్ప మరో మార్గం ఉండకపోవచ్చు. అందువల్ల ఒకే స్థాయిలో ఆదాయం తగ్గినప్పటికీ అన్ని కుటుంబాలపై దాని ప్రభావం ఒకేలా ఉండ దు. ఈ వ్యత్యాసాలను గుర్తించడం ఆర్థిక విధానాలను సమర్థంగా రూపొందించేందుకు అవసరం. ఈ ప్రవర్తనకు ద్రవ్య విధానాన్ని అనుసంధానించడంలో వుడ్ఫోర్డ్ పరిశోధ నలు కీలకమయ్యాయి. కేంద్ర బ్యాంకు ప్రస్తుత వడ్డీరేటును నిర్ణయించడమే కాకుండా, భవిష్యత్తులో తన విధానం ఎలా ఉండబోతోందన్న విషయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. అలా కల్పించే నమ్మకం రుణాలు తీసుకోవడం, ఖర్చులు చేయడం, ధరలు నిర్ణయించుకోవడం వంటి నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. వడ్డీ రేట్లు భవిష్యత్తులో పెరుగుతా యనే అంచనా ఉంటే కొన్ని కుటుంబాలు, సంస్థలు ముందు గానే తమ ఆర్ధిక నిర్ణయాలను మార్చుకోవచ్చు. అదే విధా నాలపై నమ్మకం ఉంటే అనిశ్చితి తగ్గి దీర్ఘకాలిక ప్రణాళికలకు అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ధరలు నిరంతరం పెరుగుతాయన్న అంచనాలు బలపడుతున్నప్పుడు లేదా ఆర్ధిక కార్యకలాపాలు బలహీనపడినప్పుడు కేంద్ర బ్యాంకు విశ్వసనీయతకు ప్రాధాన్యం పెరుగుతుంది.
ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీయవచ్చు
భారతదేశంలో వృద్ధిని కొనసాగిస్తూనే ప్రజల కొనుగోలు శక్తిని కాపాడుకోవ డం ప్రధాన సవాలు. అధికారిక అంచనాల ప్రకారం, 2026- 27 ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ వృద్ధి 7.8 శాతంగా నమోదైంది. అయితే, ఈ గణాంకం ఒక్కటే ప్రజల ఆదాయాలు, ఉపాధి అవకాశాలు, జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయని నిరూపించదు. వృద్ధి ఫలితాలు ఉత్పాదక పెట్టుబడులు, స్థిరమైన ఉపాధి. కుటుంబాల కొనుగోలు శక్తిగా ఎంతవరకు మారుతున్నాయో కూడా పరిశీలించాలి. ఆర్థిక వృద్ధి వేగంగా ఉన్నప్పటికీ ఉద్యోగాల కల్పన బలహీనంగా ఉంటే, ఆదాయాలు కొద్దిమంది వర్గా లకే ఎక్కువగా పరిమితమైతే దేశీయ గిరాకీకి అవసరమైన విసృత పునాది ఏర్పడదు. అందువల్ల వృద్ధి రేటుతోపాటు దాని నాణ్యత, ప్రయోజనాల విస్తరణను కూడా అంచనా వేయాలి. ఆహార ధరలు పెరిగినప్పుడు తకు 2వ ఆదాయ కుటుంబాలు తమ సంపాదనలో అధిక భాగాన్ని నిత్యావన రాలకే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇతర వస్తువులు, సేవలపై వ్యయం తగ్గడంతో వాటికి గిరాకీపడిపోవచ్చు. దాని ప్రభా వం ఉత్పత్తి, ఉపాధిపై కూడా పడుతుంది. అంటే, సరఫరా లో ఏర్పడిన సమస్యతో మొదలైన ధరల పెరుగుదల క్రమం గా మొత్తం ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీయవచ్చు. అంతేకాక, నిత్యావసరాల ధరలు పెరిగినప్పుడు కుటుంబాలు విద్య, ఆరోగ్యం, ఇతర ముఖ్యమైన అవసరాలపై ఖర్చులను కూడా తగ్గించుకునే పరిస్థితి రావచ్చు. దీనిప్రభావం తక్షణ వినియో గానికే పరిమితం కాకుండా ప్రజల జీవన ప్రమాణాలపైనా పడుతుంది. అందువల్ల కొనుగోలు శక్తిని కాపాడటం సామా జిక సంక్షేమానికే కాకుండా దేశీయ గిరాకీ నిలకడకు కూడా అవసరం.
ధరల పెరుగుదలను వడ్డీ రేట్లతో పరిష్కరించలేం
ఈనేపథ్యంలో భారతీయ రిజర్వుబ్యాంకు ధరలు పెరగడానికి గల కారణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలి. గిరాకీ అధికమవడంవల్ల ధరలు పెరుగుతున్నప్పుడు వడ్డీరేట్ల పెంపు రుణాలు, ఖర్చులను తగ్గించి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయవచ్చు. కానీ ఆహార కొరత, రవాణా సమస్యలు లేదా అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదలను వడ్డీ రేట్లతో పరిష్కరించలేం. ఇలాంటి సందర్భాల్లో ఉత్పత్తిని పెంచడం, నిల్వ సదుపాయాలను మెరుగుపరచడం, రవాణా సమస్య లను తొలగించడం అవసరం. అదే సమయంలో ధరల పెరుగుదల దీర్ఘకాలం కొనసాగితే ప్రజలు, వ్యాపార సంస్థలు భవిష్యత్తులోనూ ధరలు పెరుగుతాయని భావించి తమ నిర్ణయాలను మార్చుకోవచ్చు. అందువల్ల ద్రవ్యోల్బణం మూల కారణాన్ని గుర్తించడంతోపాటు అది ఇతర రంగాలకువ్యాపిం చే ప్రమాదాన్ని కూడా విధాన నిర్ణేతలు అంచనా వేయాలి. ప్రభుత్వ ఆర్ధిక విధానం కూడా ఇదే Google . సమతుల్యతను పాటిం చాలి. రహదారులు, రైల్వేలు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు ఉపాధిని పెంచడంతోపాటు దీర్ఘకాలిక ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. రైతులకు మెరుగైన నిల్వ, రవాణా సదుపాయాలు అందుబాటులో ఉంటే పంట నష్టాలు తగ్గి సరఫరా వ్యవస్థ బలపడుతుంది. ధరల పెరుగుదలతో ఇబ్బందిపడే వర్గాలకు లక్షిత సాయం అందించాలి. అదే సమయంలో ప్రణాళికలేని రాయితీలు, అధికప్రభుత్వ వ్యయాలు ఆర్ధిక భారాన్ని పెంచకుండా జాగ్ర త్తపడాలి. అవసరమైనవారికి అండగా నిలుస్తూనే పెట్టుబడు లు, ఉత్పాదకత, ఉపాధికి ఆటంకం కలగకుండా చూడాలి.

అన్నిసమస్యలకు పరిష్కారం చూపలేవు
ద్రవ్యోల్బణం, బలహీనమైన గిరాకీ, అంతర్జాతీయ అనిశ్చితి ఒకేసారి ఎదురైనప్పుడు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు సమ న్వయంతో వ్యవహరించాలి. ఆర్ధిక నమూనాలు విధాన నిర్ణయాలకు దిశానిర్దేశం చేయగలవు కానీ అన్నిసమస్యలకు పరిష్కారం చూపలేవు. చిన్న వ్యాపార సంస్థలు రుణాలపై ఎక్కువగా ఆధారపడవచ్చు. పెద్దకంపెనీలకు నిధుల లభ్యత మెరుగ్గా ఉండవచ్చు. అందువల్ల వడ్డీరేట్ల మార్పు అందరిపై ఒకే ప్రభావం చూపదు. చిన్న సంస్థలకు రుణవ్యయం పెరి గితే కొత్త పెట్టుబడులు పెట్టడం, కార్మికులను నియమించు కోవడం కష్టమవుతుంది. మరోవైపు, ధరల పెరుగుదల వల్ల ముడినరుకు ఖర్చులు పెరిగినా వాటిని వినియోగదారులపై పూర్తిగా మోపలేని సంస్థల లాభాలు తగ్గవచ్చు. ఈ వ్యత్యా సాలను గుర్తించేందుకు విశ్వసనీయమైన గణాంకాలు, సమ స్యలపై సరైన అంచనా, విధానాల ఫలితాలపై నిరంతర సమీక్ష అవసరం. భారతదేశం ముందున్న లక్ష్యం ద్రవ్యో ల్బణాన్ని అదుపు చేస్తూ పెట్టుబడులు, ఉపాధిని పెంచడం, ప్రజల కొనుగోలు శక్తిని కాపాడటం. ఇందుకోసం వడ్డీ రేట్ల మార్పులతోపాటు ప్రభుత్వ పెట్టుబడులు, ఉత్పత్తి పెంపు, సరఫరా వ్యవస్థల మెరుగుదల వంటి చర్యలను అవసరానికి అనుగుణంగా అమలు చేయాలి. ఆర్థిక విధానాల లక్ష్యం కేవలం గణాంకాల్లో మెరుగుదల చూపడం కాకుండా, ప్రజల జీవితాల్లో స్థిరత్వాన్ని పెంచడం కూడా కావాలి. దాని ప్రయోజనాలు విస్తృత వర్గాలకు చేరినప్పుడే ఆర్ధిక వృద్ధి నిజమైన అభివృద్ధిగా మారుతుంది.
-డిజె మోహన రావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: